- Telugu News Photo Gallery Cinema photos Bollywood Hero Salman Khan ready to act with south actors, target 2000 crore in Tollywood Telugu Heroes Photos
Salman Khan: సౌత్ హీరోస్ తో సల్మాన్.. టార్గెట్ 2 వేల కోట్లు.! నెక్స్ట్ ఎవరంటే.?
ఏదో ఒక రకంగా సౌత్ ఫ్లేవర్ లేకపోతే.. ఏదో ఇన్‌కంప్లీట్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు సల్మాన్. ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గా చెప్పకపోయినా, ఆయన వేస్తున్న అడుగులను బట్టి అర్థం చేసుకుంటున్నారు అభిమానులు.. ఇంతకీ అంతలా సల్మాన్ ఏం చేశారంటారా.? తార్‌మార్ టక్కర్ మార్ అంటూ మన దగ్గరకొచ్చి చిరు సినిమాలో స్టెప్పులేయడమే కాదు, తాను నార్త్ లో చేసిన కిసీ కా భాయ్ కీసీ కీ జాన్‌లోనూ మెజారిటీ..
Updated on: Sep 06, 2024 | 8:42 PM

ఏదో ఒక రకంగా సౌత్ ఫ్లేవర్ లేకపోతే.. ఏదో ఇన్‌కంప్లీట్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు సల్మాన్.

ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గా చెప్పకపోయినా, ఆయన వేస్తున్న అడుగులను బట్టి అర్థం చేసుకుంటున్నారు అభిమానులు.. ఇంతకీ అంతలా సల్మాన్ ఏం చేశారంటారా.?

తార్‌మార్ టక్కర్ మార్ అంటూ మన దగ్గరకొచ్చి చిరు సినిమాలో స్టెప్పులేయడమే కాదు, తాను నార్త్ లో చేసిన కిసీ కా భాయ్ కీసీ కీ జాన్‌లోనూ మెజారిటీ సౌత్ ఆర్టిస్టులను తీసుకుని మరోసారి దక్షిణాది మీద ఇంట్రస్ట్ చూపించారు సల్మాన్ ఖాన్.

ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి సికందర్. మురుగదాస్ డైరక్షన్‌లో చేస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది.

అటు మురుగదాస్‌కీ, తనకూ బ్లాక్ బస్టర్ ఖాయమని నమ్ముతున్నారు భాయీజాన్. సికిందర్ సెట్స్ మీద ఉండగానే జవాన్ సినిమా కెప్టెన్ అట్లీతోనూ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఈ సినిమాలో యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్ కీ రోల్ చేయనున్నారు. అట్లీ, కమల్, సల్మాన్ కలిసి చేసే ఆ ప్రాజెక్టు అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. జవాన్ లాగా తనకూ ఓ వెయ్యి కోట్ల మూవీ ఇస్తారనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు సల్మాన్‌ఖాన్.




