- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna son Mokshagna Teja first movie simba movie look goes viral in social media Telugu Heroes Photos
Mokshagna Teja: వారసుడొచ్చాడు.! దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఆ కుటుంబం నుంచి మరో హీరో.
వారసుడొచ్చాడు.. నందమూరి వారసుడొచ్చాడు.. దాదాపు 20 ఏళ్ళ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడొస్తున్నాడు. అది కూడా బాలయ్య తనయుడు అనేసరికి ఆ అంచనాలు మామూలుగా ఉండవు. మరి మోక్షు ఎంట్రీ ఎలా ఉండబోతుంది.? మొదటి సినిమాను ఎలా డిజైన్ చేస్తున్నారు.? తాత అడుగు జాడల్లోనే మనవడు కూడా నడుస్తున్నాడా..? నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్.
Updated on: Sep 07, 2024 | 2:02 PM

వారసుడొచ్చాడు.. నందమూరి వారసుడొచ్చాడు.. దాదాపు 20 ఏళ్ళ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడొస్తున్నాడు.. అది కూడా బాలయ్య తనయుడు అనేసరికి ఆ అంచనాలు మామూలుగా ఉండవు. మరి మోక్షు ఎంట్రీ ఎలా ఉండబోతుంది..? మొదటి సినిమాను ఎలా డిజైన్ చేస్తున్నారు..?

తాత అడుగు జాడల్లోనే మనవడు కూడా నడుస్తున్నాడా..? నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు వాళ్ల కల నెరవేరింది. సెప్టెంబర్ 6 మోక్షు పుట్టిన రోజు కానుకగా ఆయన మొదటి సినిమాను అనౌన్స్ చేసారు.

ముందు మోక్షు మూవీ కంప్లీట్ చేసిన తరువాతే నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్, ఈ లోగా తాను నిర్మాతగా ఇతర దర్శకులతో మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే కాస్టింగ్ సెట్ అయినా సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతం తన కాన్సన్‌ట్రేషన్ అంతా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మీదే ఉంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఈ తరం వారసులంతా కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీకి వస్తుంటే.. మోక్షజ్ఞ మాత్రం తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మాదిరే ఇతిహాస కథతోనే వస్తున్నారు. బాలయ్య సైతం శ్రీ కృష్ణార్జున యుద్దంతో పాటు పాండురంగడు, శ్రీ రామరాజ్యం లాంటి సినిమాల్లో దేవుడి పాత్రలు చేసారు.

జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలరామాయణంతోనే ఇండస్ట్రీకి వచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా నందమూరి మోక్షజ్ఞ లుక్ మాత్రమే విడుదల చేసారిప్పుడు. అక్టోబర్‌లో ఘనంగా ఓపెనింగ్ చేసి.. దసరా నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

అన్నీ కుదిర్తే.. 2025 జనవరి 10, బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మోక్షు మొదటి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 2003లో కళ్యాణ్ రామ్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి వస్తున్న వారసుడు మోక్షజ్ఞే.




