OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన రెండు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు.. ఎక్కడ చూడొచ్చంటే..
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఆహా ఓటీటీ. నిత్యం సినిమాలు, షోస్, వెబ్ సిరీస్ అంటూ సినీ ప్రియులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక ఇప్పుడు మరిన్ని కొత్త చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈవారం ఒక డబ్బింగ్ సినిమాతోపాటు తెలుగు సినిమాను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అటు ఇతర భాషలలోనూ భారీ వసూళ్లను రాబట్టిన చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఆహా ఓటీటీ. నిత్యం సినిమాలు, షోస్, వెబ్ సిరీస్ అంటూ సినీ ప్రియులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక ఇప్పుడు మరిన్ని కొత్త చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈవారం ఒక డబ్బింగ్ సినిమాతోపాటు తెలుగు సినిమాను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన నిలివేలిచాం మూవీ ఇప్పుడు తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని భార్గవి నిలయం పేరుతో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో టోవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రలలో హారర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఓ రచయిత కథ రాయడానికి సముద్రం ఒడ్డున ఉన్న భార్గవి నిలయం అనే పాత ఇంట్లోకి వస్తే అక్కడే ఒక ఆత్మ ఉంటుందని అందరూ చెబుతుంటారు. ఆత్మ, ఇల్లు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి ఆహా ఓటీటీతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చూడొచ్చు.
భార్గవి నిలయం ట్వీట్..
Bhargavi Nilayam: Haunted by heartbreak 💔, betrayed by love 💘.
Can our writer escape the mansion's deadly curse? 🏠👻
Watch #BhargaviNilayam on aha🎬▶️https://t.co/gMAN5j8P6F@roshanmathew22 @PoojaMohanraj @ttovino @shinetomchacko_ @rimakallingal pic.twitter.com/v2n3a9MxBk
— ahavideoin (@ahavideoIN) September 5, 2024
ఇదిలా ఉంటే.. అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా సింబా. ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సంపత్ నంది, రాజేందర్ సంయుక్త నిర్మాణం వహించిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 6 నుంచి ఆహాతోపాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
సింబా..
When the planet cries out for help, heroes rise! 🌎💔 "Simbaa" a sci-fi crime thriller 🤯
Starring @anusuyakhasba & @IamJagguBhai, premiering on Sep 6 on #aha@KasthuriShankar @DiviVadthya @ImSimhaa @Kabirduhansingh @anishkuruvilla @gautamitads #SimbaaOnAha pic.twitter.com/uRBp75ppKJ
— ahavideoin (@ahavideoIN) September 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.