Sai Pallavi: ‘వెన్నెల పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది’.. సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్…
Sai Pallavi: సాయిపల్లవి, రానా జంటగా తెరకెక్కిన సినిమా విరాట పర్వం. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నీది నాది ఒకే కథ చిత్రంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న దర్శకుడు వేణు ఉడుగుల...
Sai Pallavi: సాయిపల్లవి, రానా జంటగా తెరకెక్కిన సినిమా విరాట పర్వం. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నీది నాది ఒకే కథ చిత్రంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న దర్శకుడు వేణు ఉడుగుల విరాట పర్వాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విప్లవం, ప్రేమ ఈ రెండింటి మధ్య లంకె వేసి దర్శకుడు రాసుకున్న కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో విడుదలైంది.
జూలై 1వ తేదీని నుంచి విరాట పర్వం చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నటి సాయి పల్లవి ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. సినిమా షూటింగ్‌కు సంబంధించి కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసిన సాయి పల్లవి.. ‘విరాట పర్వం చిత్రంలోని వెన్నెల పాత్ర నాకెప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి. ఈ పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది.
ఈరోజు నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. మీరందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం ‘గార్గి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్ చిత్రంపై అంచనాలు పెంచేసింది. సాయిపల్లవి మరోసారి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించిందీ బ్యూటీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..