Major Movie: డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనున్న ‘మేజర్’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ మొదలు.. ఎందులో అంటే..
Major Movie: 26/11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'మేజర్'. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని...
Major Movie: 26/11 దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మేజర్’. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రీమియం నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. శశికిరణ్ టిక్క దర్శకత్వం, అడివి శేష్ అద్భుత నటన ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించింది. వెండి తెరపై మెస్మరైజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
థియేటర్లలో విడుదలైన సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జూలై 3వ తేదీ నుంచి మేజర్ ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘మేజర్’ సినిమాను స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లలో సినిమా మిస్ అయిన వారు, అలాగే మరోసారి సినిమా చూడాలని ఎదురు చూస్తున్న సినీ లవర్స్ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడినట్లైంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘ఎవరికీ తెలియని ఒక కొడుకు కథ. ఎవరికీ తెలియని ఒక తండ్రి కథ, ఎవరికీ తెలియని ఒక సైనికుడి కథ. మేజర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3వ తేదీ నుంచి తెలుగు, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది’ అని ట్వీట్ చేశారు.
The untold story of a son. The untold story of a father. The untold story of a SOLDIER. ???
Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam! #MajorOnNetflix pic.twitter.com/1ngxcOciuQ
— Netflix India South (@Netflix_INSouth) June 30, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..