Virata Parvam: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విరాటపర్వం.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
జూన్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వం.. రానా, సాయి పల్లవిల సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం (Virata Parvam). 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ వేణు ఉడుగుల. జూన్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. వేణు ఉడుగుల దర్శకత్వం.. రానా, సాయి పల్లవిల సహజ నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విరాటపర్వం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జూలై 1న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎల్ఎస్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ఈశ్వరీ, నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు. తెలంగాణలో 1990లో జరిగిన సరళ అనే ఓ మహిళ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని.. ఆమె జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పారు. విప్లవానికి ప్రేమకథను జోడించి అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు వేణు ఉడుగుల.
ట్వీట్..
A relentless quest for love and freedom!
Get ready to experience the world of Virata Parvam, coming to Netflix on 1st of July in Telugu, Malayalam and Tamil! #VirataParvamOnNetflix pic.twitter.com/44ks2WaJLl
— Netflix India South (@Netflix_INSouth) June 29, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.