AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: ‘కథ.. పాత్ర నచ్చితే మళ్లీ విలన్‏గా నటించేందుకు సిద్ధం’.. హీరో గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రస్తుతం తాను హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పటికీ.. కథ , రోల్ నచ్చితే మరోసారి విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను..

Gopichand: 'కథ.. పాత్ర నచ్చితే మళ్లీ విలన్‏గా నటించేందుకు సిద్ధం'.. హీరో గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Gopichand
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2022 | 2:40 PM

Share

తొలివలపు సినిమాతో హీరోగా సినీ అరంగేట్రం చేశారు మ్యాచో స్టార్ గోపిచంద్ (Gopichand). ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. దీంతో అనుహ్యంగా విలన్‏గా తెరపై కనిపించి షాకిచ్చాడు హీరో గోపిచంద్. యంగ్ హీరో నితిన్, సదా జంటగా నటించిన జయం సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి మెప్పించారు.. ఆ తర్వాత నిజం, వర్షం వంటి చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా నటించారు. విలన్‍గా సక్సెస్ అయిన గోపీచంద్.. ఆ తర్వాత వచ్చిన యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా తెరపై సందడి చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత గోపిచంద్ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు..

ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం పక్కా కమర్షియల్. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న గోపిచంద్.. ప్రస్తుతం తాను హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పటికీ.. కథ , రోల్ నచ్చితే మరోసారి విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాను.. హీరోగా ధీటుగా ఉండే విలన్ పాత్రలను చేస్తానని.. ఆ వైవిధ్యం ఉండాలంటూ చెప్పుకొచ్చారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'