Vikram OTT: విక్రమ్ ఓటీటీ రిలీజ్ అఫీషియల్ డేట్ వచ్చేసింది.. కొత్త ప్రోమో అదిరిపోయిందిగా..

కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా జూన్ 3న విడుదలైన మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

Vikram OTT: విక్రమ్ ఓటీటీ రిలీజ్ అఫీషియల్ డేట్ వచ్చేసింది.. కొత్త ప్రోమో అదిరిపోయిందిగా..
Vikram
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 29, 2022 | 3:18 PM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమాతో (Vikram) సంచలనం సృష్టించాడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan). ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా జూన్ 3న విడుదలైన మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే హీరో సూర్య చిన్న పాత్రలో మెరిసి మెప్పించారు. ఊహించని ట్విస్ట్ లతో అదిరిపోయే ఎలివేషన్స్ తో విక్రమ్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీలో రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్..

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు కొనుగోలు చేసింది.. ఇక ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది.. విక్రమ్ సినిమాను జూలై 8 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ కమల్ హాసన్‏కు సంబంధించిన కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషన్ల్ ఫిల్మ్స్, మహేంద్రన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?