OTT Movie: ఓటీటీలో చరిత్ర సృష్టించిన వెబ్ సిరీస్.. విడుదలైన మూడు రోజుల్లోనే ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ఇప్పుడు ఓటీటీలో సరికొత్త జానర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. నిత్యం కొత్త కొత్త సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది.

ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త కొత్త వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నాయి. ప్రతి వారం సరికొత్త కంటెంట్ చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ విడుదలైన మూడు రోజుల్లోనే దూసుకుపోతుంది. జూన్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన దక్షిణ కొరియా సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ మూడవ సీజన్ ఓటీటీలో సత్తా చాటుతుంది. ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్ చివరి సీజన్ మొదటి మూడు రోజుల్లో స్ట్రీమింగ్ కొత్త రికార్డును సృష్టించింది. ది గార్డియన్‌లో పబ్లిష్ అయిన ఒక నివేదిక ప్రకారం ఈ హిట్ కొరియన్ సిరీస్ స్వ్కైడ్ గేమ్ చివరి సీజన్ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ కోసం ఇప్పటివరకు అతిపెద్ద లాంచ్ వెబ్ సిరీస్‌గా మారింది. ఈ సిరీస్ విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే 60.1 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. జనాలు దీనిని 368.4 మిలియన్ గంటలకు పైగా వీక్షించారు. రెండవ సీజన్ గత డిసెంబర్‌లో 68 మిలియన్ల వ్యూస్ తో ప్రారంభమైంది. ఇప్పుడు ఇది ఓటీటీలో అతిపెద్ద వెబ్ సిరీస్‌గా అవతరించింది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంది.
ఈ సిరీస్ ను దక్షిణ కొరియా రచయిత , నిర్మాత హ్వాంగ్ డాంగ్-హ్యూక్ సృష్టించారు. ఈ సీజన్‌లో లీ జంగ్-జే, లీ బైయుంగ్-హున్, వై హా-జూన్, ఇమ్ సి-వాన్, కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, పార్క్ సంగ్-హూన్, యాంగ్ డాంగ్-గ్యూన్ నటించారు.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..




