Horror Movie: వణుకుపుట్టించే హారర్ వెబ్ సిరీస్.. అయినా ఎగబడి చూసిన జనాలు.. ఎందుకంటే..
సాధారణంగా హారర్ సినిమాలు ఆద్యంతం వణుకుపుట్టిస్తాయి. అయినప్పటికీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఒకప్పుడు హాలీవుడ్ హారర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోనూ హారర్ జానర్ సినిమాలను రూపొందిస్తున్నారు.

ఒక గ్రామంలో ఒకే తరహా హత్యలు జరగడం.. వాటి వెనుక అదృశ్య శక్తి ఉందని ఆ గ్రామస్తులు నమ్మడం.. చివరకు వరుస హత్యల వెనక ఓ వ్యక్తి ఉంటాడు. ఇలాంటి కథలు ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా వచ్చాయి. కానీ ప్రతి సినిమా, వెబ్ సిరీస్ విభిన్నమైన కంటెంట్.. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తి కలిగిస్తుంటుంది. మరికొన్ని సినిమాలు వణుకుపుట్టించే సీన్స్ తో భయపెడుతుంటాయి. అలాంటివాటిలో ఈ సినిమా ఒకటి. తమిళంలో ఈ చిత్రాన్ని ఎక్కువ మంది చూశారట. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ పేరెంటో తెలుసా.. ? ఇన్స్పెక్టర్ రిషి. టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో సునయన, కన్నా రవి, మాలిని జీవరత్నం, కుమారవేల్, మిషా ఘోషాల్ కీలకపాత్రలు పోషించారు.
గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన ఈ సీరిస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో మాత్రం అత్యధికంగా చూసిన వెబ్ సిరీస్ ఇదే. ఐఎండీబీలో 7.2 రేటింగ్ సాధించిన ఈ హారర్ వెబ్ సిరీస్.. అటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి ఇది క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. కానీ ఈ వెబ్ సిరీస్ కు హారర్ సైతం జత చేశారు. ప్రతి క్షణం ఈ సిరీస్ గ్రిప్పింగ్ గా ఉంటూ ఆసక్తిని కలిగిస్తుంది. జానర్లు ఎక్కువగా ఉన్నా.. ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందీని ఎస్జే తెరకెక్కించారు.
ప్రతీ ఎపిసోడ్ కు లింక్ కూడా అర్థవంతంగా ఉండేలా రూపొందించారు. ఒక గ్రామంలో జరిగే వరుస హత్య చుట్టూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించారు నవీన్ చంద్ర.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన