Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’.. ఎక్కడ చూడొచ్చంటే..
ఈ సినిమాలో నాని, సూర్య యాక్టింగ్ హైలెట్ కాగా.. జేక్స్ బెజేయ్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్, నాని, సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కట్టిపడేసిందని.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూస్ ఇచ్చారు సినీ విమర్శకులు. ఈ అయితే థియేటర్లలో విడుదలైన నెలకే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో మరోసారి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అడియన్స్ నుంచి రెస్పాన్స్ వ్చచింది. ఇందులో ప్రియాంక మోహన్, ఎస్ జే సూర్య, సాయికుమార్, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో నాని, సూర్య యాక్టింగ్ హైలెట్ కాగా.. జేక్స్ బెజేయ్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్, నాని, సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కట్టిపడేసిందని.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రివ్యూస్ ఇచ్చారు సినీ విమర్శకులు. ఈ అయితే థియేటర్లలో విడుదలైన నెలకే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
సరిపోదా శనివారం సినిమా సెప్టెంబర్ 26 అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్నాళ్లు థియేటర్లలలో దుమ్మురేపిన ఈ సినిమా ఇటు ఓటీటీలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారు ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయ్యోచ్చు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా సరిపోదా శనివారం చిత్రం నుంచి డిలీటెడ్ సీన్లను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు మొత్తం మూడు డిలీటెడ్ వీడియోలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలోనే సరిపోదా శనివారం నుంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లతో ఉండే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (ఓఎస్టీ)ని యూట్యూబ్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా నుంచి వచ్చిన ఓఎస్టీలో 73 బీజీఎం సౌండ్ ట్రాక్స్ ఉన్నాయి. సోనీ మ్యూజిక్ సౌత్ యూట్యూబ్ ఛానల్లో ఓఎస్టీని మూవీ టీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘రీసౌండింగ్ ఇంపాక్ట్ తో థియేటర్లను షేక్ చేసిన బీట్స్.. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేశాయి ‘ అంటూ ట్వీట్ చేసింది డీవీవీ ఎంటర్టైన్మెంట్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.