OTT: కాళరాత్రిగా మారిన విహార యాత్ర.. ఓటీటీలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలో మలయాళం సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. రియాలిటీకి దగ్గరంగా ఉండే అక్కడి సినిమాలను తెలుగు ఆడియెన్స్ కూడా అమితంగా ఆదరిస్తున్నారు. అందుకే పలు ఓటీటీ సంస్థలు కూడా మలయాళంలో రిలీజైన సూపర్ హిట్ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అలా తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఓటీటీలో మలయాళం సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. రియాలిటీకి దగ్గరంగా ఉండే అక్కడి సినిమాలను తెలుగు ఆడియెన్స్ కూడా అమితంగా ఆదరిస్తున్నారు. అందుకే పలు ఓటీటీ సంస్థలు కూడా మలయాళంలో రిలీజైన సూపర్ హిట్ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అలా తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే కాళ రాత్రి. మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ నల్ల నిళవుల రాత్రి తెలుగు వెర్షన్ ఇది. మర్ఫీ డేవసీ తెరకెక్కించిన ఈ సినిమాలో చెంబన్ వినోద్ జోస్, బాబురాజ్, సాయికుమార్, జీను జోసెస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో హీరోయిన్ ఉండదు. అందరూ మేల్ క్యారెక్టర్స్ తోనే ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్. గతేడాది థియేటర్లలో రిలీజైన కాళ రాత్రికి మంచి స్పందన వచ్చింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చి పెట్టింది. ఇప్పుడీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం (ఆగస్టు 17) అర్ధరాత్రి నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఆహాలో కాళ రాత్రి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఇక కాళ రాత్రి సినిమా కథ విషయానికి వస్తే..ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్‌ను డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆరుగురు స్నేహితులు ఓ అటవీ ప్రాంతానికి వస్తారు. అయితే తాము ముందుగా బుక్ చేసుకున్న రిసార్ట్ కాకుండా అనుకోకుండా పాడుబడ్డ బంగ్లాలో ఒక్క రాత్రి ఉండాలనుకుంటారు. ఆ పాడుబడ్డ బంగళాలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వారిని చంపాలని ప్రయత్నించిన సైకో కిల్లర్ ఎవరు? అతని బారి నుంచి ఆరుగురు స్నేహితులు తప్పించుకున్నారా? లేదా? అన్నది తెలియాలంటే కాళ రాత్రి సినిమా చూడాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న కాళ రాత్రి..
సరదాగా మొదలైన ఫ్రెండ్స్ టూర్.. కాళరాత్రిగా ఎలా మారింది?😱
Watch #Kalarathri from tomorrow only on aha 🎬#KalarathrionAha #aha pic.twitter.com/S57fO0PyrR
— ahavideoin (@ahavideoIN) August 16, 2024
#Kalarathri streaming from 17th AUG on #aha#MurphyDevasy #BaluCharan #JinuJoseph#TheGoatTrailer #justice_for_pooja #Thangalaan #MrBachchan #KanguvaFromOct10 #DevaraOnSep27th #PushpaTheRule #DemonteColony2 #RaghuThatha #KolkataDoctor #Vikram #DoubleISMART #NationalFilmAwards pic.twitter.com/2ZB7oKoEl4
— OTT Streaming Updates Reviews (@gillboy23) August 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








