Agent OTT: అఖిల్ ‘ఏజెంట్’కు బిగ్ షాక్.. ఓటీటీ రిలీజ్‌పై స్టే విధించిన కోర్టు.. కారణమిదే
అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమాను కష్టాలు వీడడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్28న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్‌గా నిలిచింది. థియేటర్లలో కొన్ని రోజులకే మాయమైంది. ఆ తర్వాత మూడు వారాలకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో తెలియదు కానీ డిజిటల్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేశారు.

అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాను కష్టాలు వీడడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్28న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్‌గా నిలిచింది. థియేటర్లలో కొన్ని రోజులకే మాయమైంది. ఆ తర్వాత మూడు వారాలకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో తెలియదు కానీ డిజిటల్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేశారు. మేలో రిలీజ్ చేస్తామని వార్తలు వచ్చినా రూమర్లుగానే మిగిలిపోయాయి. అయితే ఎట్టకేలకు శుక్రవారం (సెప్టెంబర్ 29) నుంచి ఏజెంట్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు మళ్లీ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడీ రిలీజ్ కూడా ఆగిపోయేలా ఉంది. అక్కినేని అఖిల్ సినిమా ఓటీటీ రిలీజ్‌పై కోర్టు స్టే విధించింది. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశాడంటూ విశాఖ పట్నానికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆయన వాదనలు విన్న కోర్టు ఏజెంట్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌పై స్టే ఇచ్చింది. ఈ విషయాన్ని సతీష్ బత్తుల లాయర్ మీడియాకు తెలిపారు. దీంతో అఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్, ఓటీటీ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి మరో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకుని సిక్స్ ప్యాక్‌తో కూడా దర్శనమిచ్చాడు. అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో కథా, కథనాలు లేకపోవడంతో థియేటర్లలో ఏజెంట్ నిరాశపర్చాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ సినిమాలో బాలీవుడ్ నటుడు డీనో మోరియా ప్రతినాయకుడిగా నటించాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సంపత్ రాజ్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, అనిష్ కురువిల్లా, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా స్వరాలు సమకూర్చారు.
ఓటీటీ రిలీజ్ పై సందిగ్ధత
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.