Ramabanam: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘రామబాణం’.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటించగా.. మరోసారి గోపిచంద్ సినిమాలో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించారు. లక్ష్యం, లౌక్యం తర్వాత గోపిచంద్, శ్రీవాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై అడియన్స్ అంచనాలు ఎక్కువగానే పెట్టుకున్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది.

టాలెంటెడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం రామబాణం. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటించగా.. మరోసారి గోపిచంద్ సినిమాలో జగపతి బాబు ఆయన అన్నయ్యగా కనిపించారు. లక్ష్యం, లౌక్యం తర్వాత గోపిచంద్, శ్రీవాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై అడియన్స్ అంచనాలు ఎక్కువగానే పెట్టుకున్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. మే 5న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాలో ఖుష్బూ ముఖ్య పాత్ర పోషించారు. అయితే థియేటర్లలో ఈ సినిమా విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఓటీటీలోకి రావడం లేదు. ఇందుకు గల కారణాలు కూడా తెలియడం లేదు.
ఇక ఈ సినిమా తర్వాత గోపిచంద్ సైతం సైలెంట్ అయ్యారు. తాజాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమా సెప్టెంబర్ 14 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి ఆలస్యంగా అయినా ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది.
View this post on Instagram
ఇక గోపిచంద్ సినిమాల విషయానికి వస్తే.. కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో తన 31వ సినిమా చేయనున్నాడు. పక్కా ఊరమాస్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు భీమా అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. గోలీమార్ తర్వాత గోపిచంద్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








