Telugu Indian Idol – Genelia : ఎన్నాళ్లకు హాసిని అల్లరి.. తెలుగు ఇండియన్ ఐడల్ షోలో జెనీలియా సందడి.. ప్రోమో చూశారా.. ?
సింగింగ్ టాలెంట్ ఉన్న యువత కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక ఇటీవలే ఈ షో నాలుగో సీజన్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. తాజాగా ఈషోలో హీరోయిన్ జెనీలియా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రివీల్ చేశారు.

తెలుగు ఇండియన్ ఐడల్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా అందిస్తున్న సింగింగ్ షో. ఎంతో ప్రతిభ ఉండి సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది గాయనీగాయకులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సింగింగ్ షోకు హీరోయిన్ జెనీలియా అతిథిగా వచ్చి సందడి చేసింది. చాలా కాలం తర్వాత తన కామెడీ, అల్లరితో ప్రేక్షకులను అలరించింది హసిని.
ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. తమ పాటలతో సింగర్స్ జెనీలియాను మెప్పించారు. ఇక ఎప్పటిలాగే తన మాటలతో అలరించింది జెనీలియా. తాజాగా విడుదలైన ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను సరదాగా ఆటపట్టించింది జెనీలియా.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ హోస్టింగ్ చేస్తుండగా.. తమన్, కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక జెనీలియా విషయానికి వస్తే.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల హిందీలో సితారే జమీన్ పర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే తెలుగు జూనియర్ మూవీతో చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‌కు ప్రపంచమే జై కొట్టింది..
ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..








