Dance Ikon 2: సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్.. హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో..
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో యాంకర్ హోస్టింగ్ చేస్తోన్న షో డ్యాన్స్ ఐకాన్. ఇప్పటికే ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు సెకండ్ సీజన్ వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈషో నామినేషన్స్ సైతం మొదలయ్యాయి.

ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ పేరుకు తగినట్లే రోజు రోజుకూ హీటెక్కుతోంది. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో కార్యక్రమం మరింత ఉత్కంఠగా మారింది. టాప్ ప్లేస్ కోసం ఎవరు పోటీ పడతారు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి పేర్లతో పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చెట్రీ, షోనాలి మరియు బర్కత్ అరోరా తమ పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటుండగా..వీరికి ఐదుగురు మెంటార్స్ గా మానస్, దీపిక, జాను లైరి, ప్రకృతి, యష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు.
డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ ఉత్కంఠ కలిగిస్తూ సాగాయి. టీమ్ ఎర్త్ మెంటార్ ప్రకృతి కంబం.. మానస్ నాగులపల్లి టీమ్ ‘ఫైర్’ ని నామినేట్ చేసింది. రివేంజ్ గా ప్రకృతి మెంటార్ గా ఉన్న ఎర్త్ ని మానస్ నామినేట్ చేయడం హీట్ పెంచింది. యష్ మాస్టర్, దీపికా జానులైరి ‘వాటర్’ ను నామినేట్ చేయగా, ప్రతీకారంగా జనులైరి, దీపిక ‘ఎయిర్’ ను నామినేట్ చేసింది. యశ్ మాస్టర్ ‘స్కై’ మాత్రం నామినేషన్స్ నుంచి బయటపడింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ రాబోయే రోజుల్లో డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్లు హింట్ ఇస్తోంది.
Your vote, their victory! 🏆
Show your love and save your favorite mentor & contestant. Vote now and keep the wildfire burning! 🔥
Watch #DanceIkon2WildFire streaming now on #aha.
— ahavideoin (@ahavideoIN) February 22, 2025
The Wildfire Nomination Battle Begins! 🔥 Guess who will face the heat this week!
Watch #DanceIkon2WildFire streaming now on #aha. ▶️https://t.co/tWlnNBguHt#DanceIkon2 #WildFire #DanceShow #GrandLaunch #AhaVideo #Ohmkar pic.twitter.com/T790KQy7t0
— ahavideoin (@ahavideoIN) February 20, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన