OTT: మనుషులను తినే నరమాంస భక్షకులు నగరానికి వస్తే! ఓటీటీలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా?
ఇతర జానర్లతో పోల్చుకుంటే ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాకు కాస్త ఆదరణ ఎక్కువ. ప్రేక్షకుల్లో చాలామంది ఈ జానర్ సినిమాలను చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి.

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే పలు ఓటీటీలు సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్‌ను ఎక్కువగా అందిస్తున్నాయి. అలా గతేడాది థియేటర్లలో రిలీజైన ఒక సూపర్ హిట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అదే అశ్విన్ బాబు హీరోగా నటించిన హిడింబ. 2023 జులై 20న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోనూ హిడింబ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడీ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లోనూ హిడింబ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ ఓటీటీలో హిడింబ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన ఈ సినిమాలో నందితా శ్వేతా హీరోయిన్ గా నటించింది. శ్రీనివాసరెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోదిని, రఘుకంచె తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించి హిడింబ సినిమాకు అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించారు.
ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో నూ హిడింబ స్ట్రీమింగ్..
Step into the shadows of mystery & action! 💥#Hidimbha is now streaming on @PrimeVideoIN 🔥#HidimbhaOnPrime ▶️ https://t.co/hdIic0zT6P@imashwinbabu @Nanditasweta @aneelkanneganti @vikasbadisa @AKentsOfficial #SVKCinemas #TeluguFilmNagar pic.twitter.com/9kba4qoq9A
— Telugu FilmNagar (@telugufilmnagar) February 21, 2025
హిడింబ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో కొందరు అమ్మాయిలు వరుసగా కిడ్నాప్‌కు గురవుతారు. దీని వెనక గల మిస్టరీని ఛేదించేందుకు స్పెషల్ ఆఫీసర్లుగా నందిత, అశ్విన్ బాబు రంగంలోకి దిగుతారు. అదే సమయంలో హిడింబ అనే ఓ తెగకు చెందిన ఓ వ్యక్తి జనారణ్యంలోకి వచ్చాడని తెలుస్తుంది. మరి తప్పిపోయిన మహిళలకు హిడింబ తెగకు సంబంధమేమిటి? కిడ్నాప్ అయిన అమ్మాయిలందరూ ఏమయ్యారో తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే
This is an astonishing response for #HIDIMBHA from the Hindi Audience 🤩
3️⃣0️⃣ MILLION Views for the Spine Chilling Hindi Dubbed Hidimbha movie
Watch it now! – https://t.co/qWoCbBTeJH@Nanditasweta @aneelkanneganti #SVKCinemas @AnilSunkara1 @AKentsOfficial #OAK… pic.twitter.com/Zjf2K2vspm
— Ashwin Babu (@imashwinbabu) January 2, 2024