Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారంలానే ఈసారి కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావడం లేదు. సందీప్ కిషన్ మజాకా ఒక్కటే కాస్త ఆసక్తి రేపుతోంది .మరోవైపు ఓటీటీల్లో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Feb 26, 2025 | 7:07 PM

మరికొన్ని రోజుల్లో మార్చి నెల రాబోతుంది. వేసవి సెలవులు షురూ కానున్నాయి. అయినా కానీ టాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా హైప్ ఉన్న సినిమాలేవీ రావడం లేదు. ఉన్నంతలో సందీప్ కిషన్-రావు రమేశ్ నటించిన ‘మజాకా’.. కాస్త ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు ఆది పినిశెట్టి శబ్దం సినిమాపై కూడా కాస్తా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటితో పాటు రంగం ఫేమ్ జీవా గాథియా, తకిటి తదిమి తందాన తదితర చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు-వెబ్ సిరీసులు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సుడాల్ సీజన్ 2పై అందరి దృష్టి ఉంది. మొదటి సీజన్ కు రికార్డు వ్యూస్ రావడంతో రెండో పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీటితో పాటు డబ్బా కార్టెల్, ఆశ్రమ్ తదితర వెబ్ సిరీసులు ఓటీటీ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నాయి. మరి ఫిబ్రవరి ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్‌

  • డబ్బా కార్టెల్‌ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 28

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • జిద్దీ గర్ల్స్ (హిందీ వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 27
  • హౌస్‌ ఆఫ్‌ డేవిడ్‌ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌) ఫిబ్రవరి 27
  • సుడల్‌ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 28
  • సూపర్‌ బాయ్స్‌ ఆప్‌ మాలేగావ్‌ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 28

జియో హాట్‌స్టార్‌

  • సూట్స్‌: లాస్‌ ఏంజిల్స్‌(ఇంగ్లీష్ సిరీస్‌) – ఫిబ్రవరి 24
  • బీటిల్‌ జ్యూస్‌ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 28
  • లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ (మలయాళ సిరీస్) – ఫిబ్రవరి 28
  • ది వాస్ప్‌ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 28

ఈటీవి విన్‌

  • డిటెక్టివ్‌ కాన్‌ (కార్టూన్‌ ) – ఫిబ్రవరి 27
  • ది సిస్టర్స్‌ (కార్టూన్‌ )- ఫిబ్రవరి 27
  • బాల్‌ బాహుబలి (కార్టూన్‌ )- ఫిబ్రవరి 27
  • అభిమన్యు (కార్టూన్‌ ) – ఫిబ్రవరి 27
  • కిట్టీ ఈజ్‌ నాట్‌ ఏ క్యాట్‌ (కార్టూన్‌ ) – ఫిబ్రవరి 27

సైనా ప్లే

  • స్వర్గం (మలయాళ మూవీ) – ఫిబ్రవరి 24

ఎంఎక్స్‌ ప్లేయర్‌

  • ఆశ్రమ్‌ 3 పార్ట్ 2 (హిందీ వెబ్ సిరీస్‌) – ఫిబ్రవరి 27

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!