AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa: అందమే శాపంగా మారిందా? అసలు మోనాలిసా లైఫ్‌లో ఏం జరుగుతోంది? ఆ ఐదుగురిపై కేసు నమోదు

మహాకుంభమేళా తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మోనాలిసా. ఈ వేడుకలో ఆమె పూసలు, దండలు అమ్ముతూ ఫొటోగ్రాఫర్ల కంట పడింది. అంతే తన అందం, అమయాకత్వంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఏకంగా ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. అయితే తన మొదటి సినిమాలోనే ..

Monalisa: అందమే శాపంగా మారిందా? అసలు మోనాలిసా లైఫ్‌లో ఏం జరుగుతోంది? ఆ ఐదుగురిపై కేసు నమోదు
Monalisa
Basha Shek
|

Updated on: Feb 23, 2025 | 3:35 PM

Share

మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన ఆమె పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయోగరాజ్‌ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చింది. అయితే మోనాలిసాను చూసిన కొందరు యూట్యుబర్ ఇన్‌ఫ్లూయర్స్ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అయిపోయాయి. నెట్టింట ఎక్కడ చూసిన ఆమె ఫొటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. దేశ వ్యాప్తంగా మోనాలిసా పేరు మార్మోగిపోయింది. దీంతో ఆమెకు సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆమె స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేరళ వెళ్లడం, అక్కడ ప్రముఖ వ్యాపార వేత్త బాబీ చెమ్మనూర్ ఈవెంట్ కు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాతో చనువుగా ఉండడంపై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారని.. డబ్బు కోసం ఆమెను వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా ఈ వ్యాఖ్యల పై స్పందించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. బాలీవుడ్ దర్శక నిర్మాతలు తనపై చేస్తోన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన వారిపై ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ‘తప్పుడు వ్యాఖ్యలతో నా గౌరవాన్ని దిగజారుస్తున్నారు. మోనాలిసాను రోడ్డుకు ఈడుస్తున్నారు. అందుకే ఇలా పోలీసులను ఆశ్రయిస్తున్నాను’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సనోజ్ మిశ్రా.

ఇవి కూడా చదవండి

సనోజ్ మిశ్రా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అంబోలీ స్టేషన్ పోలీసులు ఐదుగురిపై FIR నమోదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసిన వారిలో జితేంద్ర నారాయణ సింగ్, వాసిమ్ రజ్వీ, రవి సుధా చౌదరీ, మహీ ఆనంద్, మారుత్ సింగ్, అభిషేక్ ఉపాధ్యాయా ఉన్నారు. కాగా మోనాలిసా మొదటి సినిమాలోనే గందరగోళ పరిస్థితులు, అసలు ఆమె జీవితంలో ఏదో జరుగుతోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

h3>బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో..

View this post on Instagram

A post shared by Sanoj Mishra (@sanojmishra)

ఎయిర్ పోర్టులో మోనాలిసా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.