- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Deepthi Sunaina Gets Lord Shiva Tattooed On Her Hand At Kashi, See Photos
Deepthi Sunaina : కాశీకి వెళ్లి శివయ్య టాటూ వేయించుకున్న దీప్తి సునైనా.. ఫొటోస్ ఇదిగో
ప్రస్తుతం దేశమంతా ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా కూడా ఆధ్యాత్మియ యాత్రలతో బిజీగా ఉంటోంది.
Updated on: Feb 23, 2025 | 4:24 PM

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలతో బిజి బిజీగా ఉంటోంది. ఇటీవలే మహా కుంభమేళాను దర్శించుకున్న ఆమె తాజాగా తన కాశీ యాత్ర ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది

కాశీకి వెళ్లి అక్కడ పడవలో ప్రయాణిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది దీప్తి. సింపుల్ గా ముస్తాబై. ట్రెడీషనల్ గా గా పంజాబీ డ్రెస్ వేసుకుని.. నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల తన చేతిపై శివుడితో ఉన్న ఫొటోను టాటూగా వేయించుకుంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. 'శివయ్య తో నేను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

దీప్తి సునైనాకు టాటూలు ఏమి కొత్తకాదు. ఇప్పటివరకు మోడ్రన్, పేర్లతో కూడిన టాటూలు వేయించుకున్న ఈ భామ.. కాశీ యాత్ర శివయ్య టాటూ వేయించుకుంది.





























