- Telugu News Photo Gallery Cinema photos Do you know these shocking facts about senior actor Urvashi's life?
40 ఏళ్లలో రెండు పెళ్లీలు, తాగుడుకు బానిసైన ఈ స్టార్ బ్యూటీ గురించి తెలుసా?
మలయాళి నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కాలంలో ఈ నటి తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఊర్వశి తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే. ఈ బ్యూటీ ఎక్కువగా మలయాళీ, తమిళ సినిమాలో మంచి ఫేమ్ అందుకుంది. కాగా, ఊర్వశికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్లితే..
Updated on: Feb 23, 2025 | 11:44 AM

కమల్ హాసన్, రజినీకాంత్, మోహన్ లాల్ మ్మట్టి, విష్ణువర్దన్, చిరంజీవి, బాలయ్య, జగపతి బాబు, విజయ్ కాంత్ వంటి చాలా మంది స్టార్ హీరోలతో జతకట్టిన నటి ఊర్వశి. ఈమె దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలో నటించి రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి.రుస్తం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి, తర్వాత జగపతి బాబు సందే సందడే సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అలాగే బాలకృష్ణ బలే తమ్మడు సినిమాలో కూడా ఈమె సందడి చేసింది.

ఇక ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా కంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈ నటి తెలుగులో హీరోయిన్ గా చేసిన సినిమాల కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ కనిపించింది.

అయితే ఈ నటి తన కెరీర్‌లో దాదాపు 700లకు పైగా సినిమాల్లో నటించిందంట. ఈ బ్యూటీకి తమిళ్, మలయాళంలో ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారనడంలో అతిశయోక్తిలేదు. అంతలా నటనతో ఆకట్టుకంది. కాగా, తాజగా ఈ నటికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఊర్వశి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నసమయంలోనే వ్యక్తిగత సమస్యలతో మద్యానికి బానిసైపోయిందంట. దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయంట. అదే సంయంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఇలా ఆమె కెరీర్ మొత్తం దెబ్బతిన్నదంట.

దీంతో మొదటి భర్త మనోజ్ కె జయన్ వివాహం చేసుకొని బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో మొదటి భర్తకు విడాకులిచ్చి, తర్వాత 2026లో చెన్నైకి చెందిన వ్యాపార వేత్తను వివాహం చేసుకుందంట. వీరికి ఒక కుమారుడు కూడా, దీంతో ఈనటి ప్రస్తుతం సంతోషకర జీవితాన్ని గడుపుతుందంట.