Thriller Movie: భవనంలో ఒంటరిగా యువతి.. హరర్ సినిమాను మించి సస్పెన్స్.. ఈ థ్రిల్లర్ మూవీ చూస్తే..
ప్రస్తుతం సౌత్ సినిమాలు ట్రెండింగ్లో ఉన్నాయి. సినీ ప్రియులు ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరుగుతుంది. ఇప్పుడు మీ ముందుకు మరో థ్రిల్లర్ సినిమాను తీసుకువచ్చాం. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఇలాంటి జానర్ చిత్రాలు చూసేందుకు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అనుక్షణం థ్రిల్లర్ విజువల్స్.. ఊహించని ట్విస్టులు.. సస్పెన్స్ ఉండే చిత్రాలకు ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలోనే అటు ఓటీటీల్లో ఇలాంటి సినిమాలకు ఆదరణ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అలాంటి ఓ సినిమా కథ గురించి తెలుసుకుందాం. ఈ సినిమా దక్షిణాది నుంచి అత్యుత్తమ చిత్రాలలో ఒకటి.
ఒక యువతి ఒంటరిగా భవనంలో నగ్నంగా చిక్కుపోతుంది. ఆమె అక్కడి నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆమె ఎలా బయటపడుతుంది.. ? అదే ఆమె ముందున్న పెద్ద ప్రశ్న. అసలు ఆమె ఎవరు ? ఆ భవనంలోకి ఎలా వెళ్లింది.. ? ఊహించని పరిస్థితిలో ఎందుకు ఉండిపోయింది.. ? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సౌత్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ఆడై. ఈ సినిమా స్త్రీ స్వాతంత్ర్యం తిరుగుబాటు ధోరణి, దానితో వచ్చే బాధ్యతలను తెలియజేస్తుంది. ఈ సినిమా కథ మొత్తం కామిని అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె జీవితంలో ఎప్పుడూ భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటుంది.
రాజీపడని, స్వార్థపరురాలైన అమ్మాయి. ఆమె తన తండ్రితో నివసిస్తుంది . చిన్న వయసులోనే తల్లి మరణిస్తుంది. కామిని ఒక టీవీ ఛానల్‌లో పనిచేస్తుంది. అక్కడ ఆమె సాహసోపేతమైన , సామాజిక సమస్యల ఆధారంగా కార్యక్రమాలను నిర్మిస్తుంది. ఆమె ప్రవర్తన, నిర్భయ స్వభావం చాలా మందిని బాధపెడుతుంది. స్నేహితులతో కలిసి రాత్రి పార్టీ చేసుకున్న తర్వాత, ఆమె ఉదయం భవనంలో ఒంటరిగా ఉంటుంది. ఆమె అక్కడికి ఎలా చేరుకుందో ఆమెకు ఏమీ గుర్తు ఉండదు.
అనుక్షణం ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ సస్పెన్స్ తో సాగే ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అమలా పాల్ కథానాయికగా నటించింది. ఇందులో ఆమె పాత్రకు విమర్శలు ఎదుర్కొంది. కానీ తన నటనతో ప్రశంసలు సైతం అందుకుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..








