Amaran OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘అమరన్’.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా అమరన్. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకు అన్నివర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Amaran OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అమరన్'.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఎక్కడ చూడొచ్చంటే..
Amaran
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 30, 2024 | 2:39 PM

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించగా.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించింది. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్, అతడి భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించగా.. వీరిద్దరి యాక్టింగ్ పై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాను డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దాదాపు 120కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ.325 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.325 కోట్ల గ్రాస్.. 160 కోట్లకు షేర్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.

అమరన్ కథ…

ముకుంద్ వరదరాజన్.. చిన్నతనం నుంచే సైనికుడు కావాలని కలలు కంటాడు. లెఫ్టినెట్ కల్నల్ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే ఇందు రెబెకా వర్గీస్ (సాయి పల్లవి)ని ప్రేమిస్తాడు. ఆర్మీలో జాబ్ కావడంతో ఇందు కుటుంబసభ్యులు పెళ్లికి అభ్యంతరం చెబుతారు. కానీ పెద్దలను ఒప్పించి ముకుంద్, రెబెకా ఎలా ఒక్కటయ్యారు ?, ముకుంద్ వరదరాజన్ జీవితం, ఉద్యోగంలో ఎలాంటి ఆపరేషన్లను నిర్వహించాడనేది సినిమా. ఈ మూవీ డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..