Aa Okkati Adakku OTT: ఈ వారమే ఓటీటీలోకి అల్లరోడి లేటెస్ట్ మూవీ ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నాంది, ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం.. ఇలా సీరియస్ మోడ్ సినిమాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు అల్లరి నరేష్. ఈసినిమాలు అల్లరోడికి నటనా పరంగా సరికొత్త గుర్తింపు ను తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాల తర్వాత మళ్లీ తన ఫేవరెట్ ఎంటర్ టైన్ మైంట్ ట్రాక్ ఎక్కాడు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు అంటూ ఒక క్రేజీ సినిమాతో మన ముందుకు వచ్చాడు.

Aa Okkati Adakku OTT: ఈ వారమే ఓటీటీలోకి అల్లరోడి లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Allari Naresh Aa Okkati Adakku Movie
Follow us
Basha Shek

|

Updated on: May 28, 2024 | 4:32 PM

నాంది, ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం.. ఇలా సీరియస్ మోడ్ సినిమాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు అల్లరి నరేష్. ఈసినిమాలు అల్లరోడికి నటనా పరంగా సరికొత్త గుర్తింపు ను తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాల తర్వాత మళ్లీ తన ఫేవరెట్ ఎంటర్ టైన్ మైంట్ ట్రాక్ ఎక్కాడు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు అంటూ ఒక క్రేజీ సినిమాతో మన ముందుకు వచ్చాడు. మే 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఆడియెన్స్ ను బాగానే నవ్వించింది. అయితే ఎలక్షన్లు, ఐపీఎల్ ఫీవర్ కారణంగా సరైన వసూళ్లను సాధించలేకపోయింది. దీనికి తోడు సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మైనస్ గా మారింది. ఇలా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన అల్లరోడి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమె జాన్ ప్రైమ్ వీడియో అల్లరోడి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ వారమే అంటే మే 31వ తేదీ నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ సంగతి పక్కన పెడితే ఆ ఒక్కటి అడక్కు సినిమా ఓటీటీ హక్కులను ఆహా కూడా కొనుగోలు చేసిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనే అల్లరోడి సినిమా స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి మల్లీ అంకం దర్శకత్వం వహించారు. అల్లరి నరేశ్‍కు సరసన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. మరో బాలీవుడ్ నటి జామీ లెవెర్ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వెన్నెల కిషోర్, హర్ష చెముడు, సిమ్రాన్ చౌదరి, అరియానా గ్లోరీ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. చిలకా ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలకా ఈ సినిమాను నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, సూర్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ప్రభుత్వ ఉద్యోగం చేసే గణపతి (అల్లరి నరేశ్) పెళ్లి కోసం పడే తంటాల చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్. దీనికి కాస్త కామెడీ, లవ్, క్రైమ్ టచ్ కూడా ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?