Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ ఫోటో ఎడిట్ చేసిన నెటిజన్.. మృణాల్ రియాక్షన్ ఇదే..

డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ ఫోటో ఎడిట్ చేసిన నెటిజన్.. మృణాల్ రియాక్షన్ ఇదే..
Mrunal Thakur
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2024 | 2:39 PM

ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతోనే మరోసారి మెప్పించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న మృణాల్‏కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తున్న మృణాల్ తాజాగా ఓ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపావళి పండగ సందర్భంగా ఓ ఎడిటర్ ది ఫ్యామిలీ స్టార్ పోస్టర్ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన మృణాల్ తనకు ఏమాత్రం నచ్చలేదని అన్నారు.

అసలు విషయానికి వస్తే.. దీపావళి పండగ సందర్భంగా ఓ వ్యక్తి ఇన్ స్టాలో ఓ ఫోటో షేర్ చేశాడు. గతేడాది దీపావళి సందర్భంగా విడుదలైన ది ఫ్యామిలీ స్టార్ పోస్టర్ ఎడిట్ చేసి అందులో విజయ్ దేవరకొండకు బదులుగా తన ఫోటో పెట్టి మృణాల్ తో కలిసి టపాసులు కాలుస్తున్నట్లు క్రియేట్ చేశాడు. “దీపావళి ఫోటో ఎడిటింగ్.. బాలీవుడ్ నటి ఫోటోషూట్’ అని రాసుకొచ్చాడు. ఇది చూసిన మృణాల్ అసహనానికి గురైంది. వెంటనే రిప్లై ఇస్తూ.. “బ్రదర్.. మీకు మేరే ఎందుకు తప్పుడు భరోసా ఇచ్చుకుంటున్నారు ? మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారా ? ఇది ఏమాత్రం బాలేదు” అని తెలిపారు. దీనిపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ అతడి తీరుని తప్పుబడుతున్నారు.

Mrunal Thakur

Mrunal Thakur

ప్రస్తుతం మృణాల్ హిందీలో పూజా మేరీ జాన్, హై జవానీ్ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2, తుమ్ హీ హో వంటి చిత్రాల్లో నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. అలాగే తెలుగులో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది మృణాల్.

View this post on Instagram

A post shared by SAUKHIN MALIK (@its_saukhin)

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!