Leena Antony: ఏడు పదుల వయసులో పదో తరగతి పరీక్షలు రాసిన నటి.. కోడలి ప్రోత్సాహంతో..
కలలు సాకారం చేసుకోవడానికి వయసుతో పనిలేదని ఇప్పటికే చాలామంది నిరూపించారు. లేటు వయసులో తమ కిష్టమైన పనులు చేస్తూ, అభిరుచులు నెరవేర్చుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు కొందరు మహిళలు. ఇదే కోవకు చెందుతారు మలయాళ నటి లీనా ఆంటోని.

కలలు సాకారం చేసుకోవడానికి వయసుతో పనిలేదని ఇప్పటికే చాలామంది నిరూపించారు. లేటు వయసులో తమ కిష్టమైన పనులు చేస్తూ, అభిరుచులు నెరవేర్చుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు కొందరు మహిళలు. ఇదే కోవకు చెందుతారు మలయాళ నటి లీనా ఆంటోని. 73 ఏళ్ల ఈ నటీమణి పదో తరగతి పరీక్షకుల హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. చేర్తాల గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆమె పరీక్షలు రాశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా యాక్షన్ డ్రామాగా రూపొందిన మహేశింటే ప్రతీకారమ్ సినిమాలో ఫహద్ ఫాజిల్‌కు తల్లిగా లీనా ఆంటోనీ నటించారు. ఇందులో ఆమె అభినయం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమా తెలుగులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ పేరుతో రీమేక్ అయింది. సత్య దేవ్ హీరోగా నటించాడు.
మహేశింటే ప్రతీకారమ్ తో పాటు ‘మకల్’, ‘జో & జో’, ‘ముంతిరి వల్లికల్ తళిర్కుంబోల్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు లీనా. కాగా ఆమె 13 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. కుటుంబ బాధ్యతలన్నీ లీనా భుజాన పడ్డాయి. దీంతో పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయింది. కుటుంబాన్ని పోషించడం కోసం నాటకాల్లో నటించడం మొదలు పెట్టింది. తర్వాత అదే జీవనాధారంగా మారిపోయింది. ఆ తర్వాత రంగస్థల నటుడు కేఎల్ ఆంటోనిని వివాహం చేసుకుంది. కొన్నేళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఈనేపథ్యంలో ఒంటరి తనంతో బాధపడుతోన్న ఆమెకు కోడలు మాయాకృష్ణన్ అండగా నిలబడింది. చిన్నతనంలో ఆపేసిన చదువును మళ్లీ ప్రారంభించమని సలహా ఇచ్చింది. అలా ఆమె ప్రోత్సాహంతోనే తాజాగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు లీనా.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




