Rashmika Mandanna: కాలేజ్ డేస్‌లో రష్మిక ఎలా ఉండేదో తెలుసా.. చూస్తే మతిపోవాల్సిందే

టాలీవుడ్‌లోకి వచ్చిన తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ మారిపోయింది రష్మిక మందన్న. ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రష్మిక మందన్న

Rashmika Mandanna: కాలేజ్ డేస్‌లో రష్మిక ఎలా ఉండేదో తెలుసా.. చూస్తే మతిపోవాల్సిందే
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2022 | 5:59 PM

టాలీవుడ్‌లోకి వచ్చిన తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ మారిపోయింది రష్మిక మందన్న(Rashmika Mandanna). ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రష్మిక మందన్న. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ బ్యూటీ. కన్నడలో పలు సినిమాల్లో నటించిన రష్మిక .. తెలుగులో మాత్రం మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకె తో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.

సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటోంది. ప్రతిరోజు తన సినిమా విషయాలతో పటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక కాలేజ్ డేస్ వీడియో ఇది. ఈ వీడియోలో రష్మిక తన కాలేజ్ ఈవెంట్ లో డాన్స్ చేస్తూ కనిపించింది. బాలీవుడ్ సాంగ్ కు లేడి పిల్లలా గంతులేస్తూ కనిపించింది రష్మిక. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వ్ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..