Godfather : ”గాడ్ ఫాదర్” నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. అదరగొట్టిన మెగాస్టార్, సల్మాన్
చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. ఇప్పటికే చిరు బర్త్‌డే సందర్భంగా గాడ్ ఫాదర్ టైటిల్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్ ...జెస్ట్ టైటిల్ వీడియోతో యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టారు.

చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్(Godfather )సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. ఇప్పటికే చిరు బర్త్‌డే సందర్భంగా గాడ్ ఫాదర్ టైటిల్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్ …జెస్ట్ టైటిల్ వీడియోతో యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టారు. ఇక ఈమధ్యనే గాడ్ ఫాదర్ ఎలా ఉంటారో మనకు చూపించేసి… నెట్టింట వేరేలెవల్ హంగామాను క్రియేట్ చేశారు. చిరు ఫస్ట్ లుక్‌తో పాటు గాడ్ ఫాదర్ సినిమాను విజయదశమికే రిలీజ్ చేస్తామంటూ కన్ఫర్మ్ చేశారు మేకర్స్ . దీంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వెయింటింగ్ షూరూ అయిపోయింది. వెరీ రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ టీజర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో మెగాస్టార్, సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ చేశారు. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరు, నయన్ మధ్య ఎమోషన్ సూపర్ గా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో సత్య దేవ్, సునీల్ , పూరి జగన్నాధ్ కనిపించనున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ అండ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆర్బి చౌదరి , ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..