Varalaxmi Sarathkumar: సన్నజాజిలా మారిపోయిన జయమ్మ.. అందుకోసమేనా..?

ప్రస్తుతం లేడీ విలన్‌గా రాణిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది వయ్యారిభామ వరలక్ష్మీ. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన వరలక్ష్మీ ఆ  తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది.

Varalaxmi Sarathkumar: సన్నజాజిలా మారిపోయిన జయమ్మ.. అందుకోసమేనా..?
Varalakshmi Sarathkumar
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2022 | 6:26 PM

ప్రస్తుతం లేడీ విలన్‌గా రాణిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది వయ్యారిభామ వరలక్ష్మీ(Varalaxmi Sarathkumar). హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన వరలక్ష్మీ ఆ  తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత విలన్ గా మారి భయపెట్టింది. నెగిటివ్ రోల్స్ లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో వరలక్ష్మీ నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. జయమ్మగా వరలక్ష్మీ నటనకు ఇంప్రస్ అయిన దర్శకులు ఇప్పుడు ఈ అమ్మడుకు వరుస సినిమాలు ఇస్తున్నారు. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటిస్తోంది వరలక్ష్మీ.

అలాగే సమంత నటిస్తున్న యశోద సినిమాలోనూ ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోల్లో వరలక్ష్మీ సన్నగా కనిపించింది. బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ.. సడన్ గా సన్నజాజిలా మారిపోయింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కనుందని అందుకే సన్నగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. అయితే గతంలో వరలక్ష్మీ, విశాల్ లవ్‌లో ఉన్నారని.. పెళ్లిపీటలెక్కనున్నారని టాక్ వినిపించింది కూడా..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి