AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: నా మనసు ఉప్పొంగిపోయింది.. పవన్ స్పీచ్ పై చిరంజీవి రియాక్షన్ ఇదే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా సినీరంగానికి దూరంగా ఉంటూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్.. తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

Megastar Chiranjeevi: నా మనసు ఉప్పొంగిపోయింది.. పవన్ స్పీచ్ పై చిరంజీవి రియాక్షన్ ఇదే..
Megastar Chiranjeevi, Pawan
Rajitha Chanti
|

Updated on: Mar 15, 2025 | 9:22 AM

Share

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో ఆయన నటిస్తోన్న సినిమాల చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమయం కుదిరినప్పుడు వీలైనంత త్వరగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే.. తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో ఈ సభను ఏర్పాటు చేయగా.. భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పవన్ మాట్లాడుతూ.. గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని.. అనేక కుట్రలు చేశారని అన్నారు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేవని అన్నారని.. కానీ ఇప్పుడు వందశాతం విజయం సాధించి జయకేతనం ఎగురవేస్తున్నామని అన్నారు. జయకేతనం సభలో పవన్ ఇచ్చిన స్పీచ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ మాటలకు ముగ్దులయ్యారు. ఈమేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన మనసులోని మాటలను బయటపెట్టారు.

“మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు ! ” అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరలవుతుంది.

జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా అని.. తెలంగాణ భూమి తనకు పునర్జన్మ ఇచ్చిందని అన్నారు. తాను సినిమాల్లోకి రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని అన్నారు. కోట్ల మందికి సంబంధించిన రాజకీయాల్లోకి వచ్చానంటే అది భగవంతుడి దయేనన్నారు పవన్.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..