Heroines Favorite Food : మన ముద్దుగుమ్మలకి ఈ ఫుడ్స్ అంటే ప్రాణం.. కనబడితే అస్సలు వదలరు..
అందరికి ఇష్టమైన ఆహారాలు ఉంటాయి. అలాగే మన ముద్దుగుమ్మలకి కూడా కొన్ని ఫుడ్స్ అంటే చాల ఇష్టం. ఇవి కనిపిస్తే తినకుండా అస్సలు ఉండలేము అంటున్నారు ఈ బ్యూటీస్. ఎవరా హీరోయిన్స్.? వారు ఇష్టంగా తినే ఆహారాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి..
Updated on: Mar 15, 2025 | 10:00 AM

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆలు పరోటా, గులాబీ జామ్ అంటే తెగ ఇష్టమంటా. అయితే ఎంత ఇష్టంగా తింటుందో పెరిగిన బరువు తగ్గడానికి అదే స్థాయిలో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

నేషనల్ క్రష్ రష్మికకు నెయ్యితో వేసిన దోశ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తానే స్వయంగా దోసెలు వేసుకొని తింటానని తన అభిరుచి తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ శృతిహాసన్‌కు చికెన్ సాంబార్ అంటే ఎంతో ఇష్టమని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంటా బయటా అనే తేడా లేకుండా ఎక్కడ కనిపించినా తింటానని తెలిపింది.

ఇక సమంతకు స్వీట్ పొంగల్ అంటే ప్రాణమంటా. అలాగే సాంబార్‌ను ఎంతో ఇష్టంగా తింటానని తెలిపిన సామ్.. పాలకోవాతో చేసిన పదార్థాలను ఇష్టంగా తింటానని తెలిపింది. ఇవన్నీ గతంలో చాల ఇంటర్వ్యూల్లో తెలిపింది.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు హైదరాబాద్ బిర్యానీ అంటే తెగ ఇష్టమని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా బిర్యానీ తింటానని పలుమార్లు కొన్ని ఇంటర్వ్యూల్లో తెలిపింది.

అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నాకు బిర్యానీ అంటే ఎంతో ఇష్టమంటా. అలాగే చేపలు పులుసును కూడా ఎంతో ఇష్టంగా తింటానని తెలిపిన రాశి, మామిడికాయ పికిల్ అంటే కూడా తనకు ఇష్టమని తెలిపింది.





























