Sarkaru Vaari Paata: ‘మ..మ.. మాస్‌ మహేశ్‌’ వచ్చేశాడు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘సర్కారు సాంగ్‌’..

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల...

Sarkaru Vaari Paata: 'మ..మ.. మాస్‌ మహేశ్‌' వచ్చేశాడు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న 'సర్కారు సాంగ్‌'..
Ma Ma Mahesha Song
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 17, 2022 | 4:36 PM

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా గ్రాస్‌ను రాబట్టి మహేశ్‌ కెరీర్‌లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా గుర్తింపు దక్కించుకుంది. బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న అంశాన్ని ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

సినిమా విజయంలో ఈ సినిమాలోని పాటలు కూడా ముఖ్య పాత్ర పోషించాయని చెప్పడంలో ఎలాంటి సందేహంల ఏదు. కళావతి లాంటి క్లాస్‌ సాంగ్‌తో పాటు, ‘మ‌.. మ‌.. మ‌హేశా’ అనే మాస్ బీట్‌ సాంగ్‌ విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ పాట వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. శ్రీకృష్ణ, జోనితా గాంధీ పాడిన ఈ పాట‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటలో మహేశ్‌ మాస్‌ స్టెప్పులకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇక యూట్యూబ్‌లో సైతం ఈ పాట రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్‌ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

ఇక మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేశ్‌కు జోడిగా కీర్తి సురేశ్‌ నటించింది. థియేటరల్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ విధానంలో అందుబాటులో ఉండగా, జూన్‌ 23 నుంచి ఉచితంగా అందుబాటులోకి రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..