Tollywood : పెద్ద హీరోలతో 30కి పైగా సినిమాలు.. స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకుంటే.. జిల్లా కలెక్టర్ అయ్యింది..
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. అలాగే కొందరు చైల్డ్ ఆర్టిసులు కూడా. ఎన్నో సినిమాల్లో నటించి జనాలకు దగ్గరవుతారు. ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ బాలనటి సైతం అలాంటి జాబితాలోకి చెందినవారే. స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకుంటే ఐఏఎస్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీలో బాలనటిగా అడుగుపెట్టి, ఎంతోమంది ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న తారలు కొందరైతే.. భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతారని అందరూ భావిస్తున్న తరుణంలో ఊహించని రంగంలోకి ప్రవేశించి ఉన్నత స్థానానికి చేరుకున్నవారు మరికొందరు. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది హెచ్.ఎస్. కీర్తన ప్రయాణం. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్, నటిగా వెండితెరను, బుల్లితెరను ఏలిన ఈ ముద్దుగుమ్మ, గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా వీడ్కోలు పలికి సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసి ఇప్పుడు ఒక జిల్లాకు కలెక్టర్ స్థాయికి ఎదిగింది. ఈ అరుదైన ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా హోసకేరె గ్రామానికి చెందిన కీర్తన చిన్న వయసులోనే నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. కేవలం నాలుగేళ్ల ప్రాయంలోనే ‘కర్పుర్దా గొంబే’ సినిమాతో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస అవకాశాలను అందుకున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ప్రముఖ హీరోల చిత్రాలతో పాటు దాదాపు 30కి పైగా సినిమాలలో బాలనటిగా , సహాయ నటిగా నటించారు. కేవలం వెండితెరపైనే కాకుండా, సుమారు 40కి పైగా టెలివిజన్ షోలు , ధారావాహికలలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా అత్యంత సన్నిహితులయ్యారు. ‘గంగ-యమున’, ‘హబ్బా’, ‘లేడీ కమిషనర్’ వంటి ప్రాజెక్ట్‌లు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
సినిమా రంగంలో మంచి ఫామ్‌లో ఉండి, భవిష్యత్తులో అగ్రశ్రేణి నటిగా లేదా స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అందరూ భావించిన సమయంలో కీర్తన తన కెరీర్‌పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నటన కంటే పబ్లిక్ సర్వీస్ వైపు తన లక్ష్యాన్ని మళ్లించారు. చదువుపై ఎంతో శ్రద్ధ పెట్టడంతో పాటు సివిల్స్ సాధించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (KAS) పరీక్షలో ఉత్తీర్ణులై కొంతకాలం ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు. అయితే ఆమె అసలు కల మాత్రం యూపీఎస్సీ (UPSC) సాధించి ఐఏఎస్ అధికారిగా దేశానికి సేవ చేయడమే.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఈ లక్ష్య సాధన కోసం ఆమె ఎంతో శ్రమించారు. వరుసగా ఐదుసార్లు సివిల్స్ పరీక్షల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరింత కఠినంగా శ్రమించారు. తన ఆరో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో 167వ ర్యాంక్‌ను సాధించి సంచలనం సృష్టించారు. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి, దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఒక ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టి ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. వెండితెరపై బాలనటిగా అలరించిన కీర్తన, రియల్ లైఫ్‌లో జిల్లా కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తూ నిజమైన ‘కింగ్ మేకర్’ అనిపించుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
హెచ్ ఎస్ కీర్తన..

Hs Keerthana Movies
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
