AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanika Kapoor: రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న ‘పుష్ప’ సినిమా సింగర్.. కారణమిదే

బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ మరోసారి వార్తల్లో కెక్కింది. ఇప్పటికే మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె తాజాగా రెండో భర్త నుంచి కూడా విడిపోయారు. ఈ విషయాన్ని కనికా కపూరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ కష్ట సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులకు, మీడియాకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Kanika Kapoor: రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సినిమా సింగర్.. కారణమిదే
Kanika Kapoor
Basha Shek
|

Updated on: Nov 04, 2026 | 12:22 PM

Share

‘రాగిణి ఎంఎంఎస్ 2’ సినిమాలోని ‘బేబీ డాల్’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ తన రెండవ భర్త గౌతమ్ హతిరమాని నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2022లో లండన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట, నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకుంటూ, ఈ కష్ట సమయంలో తన గోప్యతను గౌరవించాలని కనికా అందరినీ కోరారు. ‘మన దారులు ఇప్పుడు వేరయ్యాయి. మనం కలిసి గడిపిన క్షణాలకు నేను కృతజ్ఞురాలిని. మన భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతను గౌరవించండి’ అని కనికా కపూర్ కోరింది. అయితే విడాకులకు గల కచ్చితమైన కారణాన్ని ఆమె వెల్లడించలేదు. చాలా సంవత్సరాలుగా గౌతమ్‌తో ప్రేమలో ఉన్న కనిక, 2022 మే 20న లండన్‌లో వివాహం చేసుకుంది. ఇది కనికా కపూర్‌కు రెండవ వివాహం. ఆమె గతంలో వ్యాపారవేత్త రాజ్ చందోక్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అయానా, సమీరా, యువరాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే 2012లో విడాకులు తీసుకున్నారు కనికా- రాజ్. ఇక భర్త నుంచి విడిపోయిన తర్వాత ఇండియాకు తిరిగొచ్చేసిన కనికా కపూర్ మళ్లీ సింగర్ గా బిజీగా మారిపోయారు.

ఇవి కూడా చదవండి

కనికా కపూర్ ‘రాగిణి ఎంఎంఎస్- 2’లోని ‘బేబీ డాల్’పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారామె. ఆ తర్వాత లవ్లీ ‘హ్యాపీ న్యూ ఇయర్’, దేశీ లుక్ ‘ఏక్ పహేలి లీలా’, బీట్ పె బూటీ ‘ఎ ఫ్లయింగ్ జాట్’ వంటి వరుస హిట్‌ సాంగ్స్‌తో బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు కనిక. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్ హిందీ వెర్షన్ ను కనికా కపూరే ఆలపించడం విశేషం. ఇటీవల హిందీలో తెరకెక్కిన ‘మేరే హస్బెండ్ కి బివి’ చిత్రంలోని ‘గోరీ హై కలైయాన్’ పాటను ఈ సింగరే పాడింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.

సింగర్ కనికా కపూర్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సింగర్.. కారణమిదే
రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న 'పుష్ప' సింగర్.. కారణమిదే
Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్..
Video: స్లెడ్జింగ్ చేసి మరీ వికెట్ తీసిన టీమిండియా బౌలర్..
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
వాట్సాప్‌లో పిల్లల పరీక్షల రిజల్ట్స్! తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
నడుం బలాన్ని.. కంటిచూపును.. పెంచే జావ.. అస్సలు మిస్సవకండి
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
మిత్రుడిని చంపి కాలువలో పడేశాడు.. శవం కలలోకి వస్తోందంటూ..
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
సచిన్, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్ చెత్త రికార్డ్..!
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
బ్యాంక్ FD కంటే ఎక్కువ వడ్డీ.. 8.20% వరకు రాబడినిచ్చే 4 పథకాలు..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. తుఫాను సాయంపై కేంద్రానికి సీఎం లేఖ
సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. తుఫాను సాయంపై కేంద్రానికి సీఎం లేఖ
ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?
ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?