Ramayana: రావణుడిగా యశ్ ఉన్నాడని.. ‘రామాయణ’ లో సీత పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్! అసలు విషయమిదే
రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి సీతా రాములుగా నటిస్తోన్న చిత్రం 'రామాయణ'. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్జ్ మైథాలాజికల్ మూవీ గురువారం (నవంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

రామాయణ కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగు, హిందీ, తమిళం.. ఇలా ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు ఈ ఇతిహాసం ఆధారంగా వచ్చాయి. ఇప్పుడు రామాయణం ఆధారంగా మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కించిన రామాయణ. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ ఇందులో శ్రీరాముడిగా నటించారు. అలాగే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇందులో సీతమ్మగా కనిపించింది. రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ యష్ భయపెట్టనున్నాడు. సుమారు 4000 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా రామాయణ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, గ్లింప్స్ , ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకున్న రామాయణ ఈ గురువారం (నవంబర్ 05) న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రామాయణ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో సీత పాత్రలో ముందుగా సాయి పల్లవిని అనుకోలేదట. ఆమె కంటే ముందు ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి సీతమ్మ పాత్ర కోసం ఆడిషన్స్ ఇచ్చారని వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ సినిమాలో యశ్ రావణాసురుడిగా కనిపిస్తున్న నేపథ్యంలో సీత పాత్రను ఆమె రిజెక్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. కేజీ ఎఫ్ సినిమాలో యశ్ కు ప్రియురాలుగా నటించిన ఈమె ఇప్పుడు యష్ కు వ్యతిరేకంగా నటించలేను అంటూ ఈ సినిమా రిజెక్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలేనని ఖండించింది శ్రీనిధి శెట్టి. రామాయణ సినిమాలో సీత పాత్రను తానే రిజెక్ట్ చేసాను అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.
‘ రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్లిన మాట వాస్తవమే. అయితే ఆడిషన్స్ లో నేను సెలెక్ట్ అవ్వలేదు. అందుకే నేను ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయాను’ అని ఆ మధ్యన చెప్పుకొచ్చింది శ్రీనిధి. ఇక రామయాణ సినిమా విషయానికి వస్తే.. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హరీశ్ ఉత్తమన్, ఫైసల్ మాలిక్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ముకేశ్ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్ సచ్దేవ్, రవి దూబే, ఆదినాథ్ కొఠారే, నితీశ్ శర్మ.. ఇలా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు.
రామాయణం సాంగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




