AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న కాంట్రవర్సీ మూవీ.. ట్విస్టులకు మతి పోద్ది.. తెలుగులోనూ చూడొచ్చు

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా గుర్తుందా? అందులో ఎన్టీఆర్ లంచాలు తీసుకునే అవినీతి పోలీస్ అధికారిగా నటించారు. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా సరిగ్గా ఇదే టెంప్లేట్ లోనే సాగుతుంది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న కాంట్రవర్సీ మూవీ.. ట్విస్టులకు మతి పోద్ది.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 03, 2026 | 9:07 PM

Share

ప్రస్తుతం సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించే. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసినప్పుడే చాలా వివాదాలు తలెత్తాయి. సినిమా పేరు, హీరో పాత్రను రూపొందించిన తీరుపై తీవ్ర దుమారం రేగింది. ఆ పేరు, స్టోరీ లైన్‌ తమ వర్గాన్ని కించపరిచేలా ఉందని బ్రాహ్మణ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ ఆ సంఘం కోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో చిత్రబృందం సినిమా పేరును మార్చేసింది. ఇటీవలే డైరెక్టుగా ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో డ్రగ్ మాఫియా, పొలిటికల్ కనెక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఓటీటీ స్ట్రీమింగ్ లిస్టులో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్క రాత్రిలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించారు. ఢిల్లీ నగరంలో రాత్రి సమయంలో ఓ కదులుతున్న కారు నుంచి తీవ్ర గాయాలతో ఉన్న యువతిని బయటకు విసిరేస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. అయితే ఆమెను చంపడానికి కొందరు ప్రయత్నిస్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు చంపాలనుకుంటున్నారు? లంచాలు తీసుకునే పోలీస్ అధికారి అజయ్ దీక్షిత్‌ ఈ కేసులోకి ఎలా వచ్చాడు? డబ్బు కోసం నిజాన్ని పక్కన పెడతాడా? లేక తన బాధ్యతను గుర్తించి న్యాయం వైపు అడుగులు వేస్తాడా? అనేదే ఈ సినిమా స్టొరీ.

స్టోరీ వింటుంటే ఎన్టీఆర్ టెంపర్ సినిమా గుర్తొస్తొంది కదా.. స్టోరీ ఒకేలా ఉన్నా… ఇందులో స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పైగా ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘గజబ్ రాత్’ (Gajab Raat). ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లతో తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ గా మారిపోయిన మనోజ్ బాజ్ పాయి ఇందులో లీడ్ రోల్ పోషించారు. ఈ మూవీకి నీరజ్ పాండే, రితేశ్ షా దర్శకత్వం వహించారు. నోజ్‌తో పాటు సాకిబ్ సలీమ్, దివ్య దత్తా, నుష్రత్ భరుచా, శ్రద్ధా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నీరజ్ పాండే నిర్మాణంలో ఫ్రైడే స్టోరీటెల్లర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

మనోజ్ బాజ్ పాయి గజబ్ రాత్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us