తమన్నా ఇక తెలుగులో కష్టమేనా

03 November 2026

Rajeev 

తమన్నా భాటియా ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

హ్యాపీ డేస్, 100 పర్సెంట్ లవ్, రచ్చ, బాహుబలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

 బాహుబలి సినిమాతో తమన్నా క్రేజ్ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది.

 గతంతో పోలిస్తే ప్రస్తుతం తమన్నా తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టుల్లో ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు.

తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ తమన్నా అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

 సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించడం తగ్గించినా ప్రత్యేక పాటలు, స్పెషల్ అప్పియరెన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.