AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayasudha: ఆ సినిమాలో శ్రీదేవే ప్రాబ్లమ్.. అందుకే ఆ మూవీలో చేయనని చెప్పా.. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..

సహజనటి జయసుధ తన సినీ కెరీర్‌లోని కీలక ఘట్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రేమాభిషేకంలో వేశ్య పాత్ర, మేకప్‌ లేకుండా నటించిన ధైర్యం, శ్రీదేవి, జయప్రద వంటి స్టార్లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న అనుభవాలను వివరించారు. క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఇస్తూ, దర్శకుల మార్గదర్శకత్వంలో ఎలా ముందుకు సాగారో వెల్లడించారు.

Jayasudha: ఆ సినిమాలో శ్రీదేవే ప్రాబ్లమ్.. అందుకే ఆ మూవీలో చేయనని చెప్పా.. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..
Jayasudha
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2026 | 12:46 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటి జయసుధ తన కెరీర్‌లోని మర్చిపోలేని అనుభవాలను, ముఖ్యంగా అగ్రతారలు శ్రీదేవి, జయప్రద వంటి వారితో కలిసి నటించిన సందర్భాలను ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన పాత్రల ఎంపిక, చిత్రసీమలో తన స్థానం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రేమాభిషేకం చిత్రంలో వేశ్య పాత్రను అంగీకరించినప్పుడు ఎదురైన సవాళ్లను జయసుధ వివరించారు. ఆ సమయంలో తాను టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పటికీ, అలాంటి పాత్రకు ఒప్పుకోవడం ఒక సాహసమని ఆమె అన్నారు. దర్శకుడు దాసరి నారాయణరావు, తన గురువుగా, మార్గదర్శకుడిగా చెప్పడంతోనే తాను ఆ పాత్రను చేశానని వెల్లడించారు. ఆయన ఫోన్ చేసి జయసుధ… ఇలాంటి ఒక క్యారెక్టర్… అని చెప్పినప్పుడు, మొదట శ్రీదేవికి సమానమైన పాత్ర ఉండాలని తాననుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, దాసరి గారు నీకు శ్రీదేవి కాదు ఎవరూ కనిపించరు సినిమాలో. నీకే పేరు వస్తుంది. నన్ను నమ్ము నువ్వు అని నమ్మకం కలిగించారని జయసుధ చెప్పారు.

ఈ చిత్రంలో ఆమె మేకప్‌ లేకుండా కనిపించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. దాసరి గారే మేకప్ తీసేయమని చెప్పారని, శ్రీదేవి కంటే సింపుల్‌గా, కేవలం పెద్ద బొట్టుతో కనిపించానని ఆమె తెలిపారు. ఆ పాత్రలోని డైలాగులు, ఆమె నటన ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో గుర్తుచేసుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత వందరోజుల ఫంక్షన్లలో ప్రేక్షకులు తమను, శ్రీదేవిని ఆ డైలాగ్ చెప్పండి అని అడిగేవారని జయసుధ పేర్కొన్నారు. తన పాత్రకు అద్భుతమైన స్పందన లభించిందని, సినిమా మొత్తం తనకే పేరు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన త్రిశూలం సినిమాలో శ్రీదేవి, రాధికలతో కలిసి నటించిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఈ సినిమాలో తనకు కేవలం ఒక పాట, మూడు సీన్లే ఉన్నప్పటికీ, రాఘవేంద్రరావు గారు ఇంటర్వెల్ లో ఎలా ఇంట్రడక్షన్ ఇస్తానో చూడు అని చెప్పారని జయసుధ గుర్తుచేసుకున్నారు. ఇంటర్వెల్ సమయంలో ఆమె ఎంట్రీ సీన్‌ను ఫ్రీజ్ చేసి జయసుధ అని టైటిల్ వేసిన విధానం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆమె అన్నారు. ఆ చిత్రంలోని రాయిని ఆడది చేసిన రాముడివో అనే పాట ఇప్పటికీ తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిందని, ఆ పాటకు లభించిన ఆదరణ అద్భుతమని వివరించారు.

శ్రీదేవి, జయప్రద వంటి అందాల తారల పక్కన డీ-గ్లామరైజ్డ్‌గా కనిపించడంపై అడిగిన ప్రశ్నకు, తనది భిన్నమైన శైలి అని జయసుధ సమాధానమిచ్చారు. అందం అన్నది ఒట్టి అందంలోనే కాదు, అది గ్లామర్‌గా… అని వ్యాఖ్యానిస్తూ, తన దృష్టిలో పాత్రకే ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నాకు మీరు ఎన్ని పాటలు శ్రీదేవికి ఇస్తారో, ఎన్ని పాటలు జయప్రదకి ఇస్తారో నాకు సంబంధం లేదు. పేరు మాత్రం నాకే రావాలి అనే పద్ధతిలో తాను పాత్రలను ఎంచుకునేదానినని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us