AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 2 కోట్ల బడ్జెట్.. రూపాయి లాభం లేదు.. అయినా ప్రపంచం మొత్తం ఫిదా అయిన సినిమా..

దాదాపు 2 కోట్లతో తెరకెక్కించిన ఓ సినిమా కనీసం రూపాయి కూడా వసూలు చేయలేదట. కానీ ఆ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ అందుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీ గురించి మీకు సరిగ్గా తెలియకపోవచ్చు. కానీ స్టార్స్ లేకపోయినా ఆ మూవీకి వరల్డ్ వైడ్ సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

Rajitha Chanti
|

Updated on: Nov 04, 2026 | 11:01 AM

Share
 కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో విమర్ధ్ ఒకరు. ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న ఆయన నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే, తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో తాను నటించిన సినిటాలన్నింటిలోకి 'కుట్రమే దండనై' చిత్రమే అత్యుత్తమమైనదిగా నిలుస్తుందని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

1 / 5
ప్రముఖ దర్శకుడు మైస్కీన్ శిష్యుడిగా ఇండస్ట్రీకి వచ్చి, స్వతహాగా సంచలన విజయాలను అందుకున్న యువ దర్శకుడు ఎం. మణికందన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అంతకుముందు కాక ముట్టై వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను అందించిన మణికందన్ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విమర్ధ్ పోషించిన పాత్ర ఎంతో వైవిధ్యమైనదిగా ఉండటంతో పాటు, ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.

2 / 5
ఈ సినిమా షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ, ఒక సాధారణ యువకుడి జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యే సంఘటనల చుట్టూ తిరిగే ఈ కథ తన మనసుకు ఎంతో హత్తుకుందని విమర్ధ్ తెలిపారు. కమర్షియల్ హంగులకు దూరంగా, పూర్తిగా సహజసిద్ధమైన వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించడం తనకు ఒక నటుడిగా గొప్ప సంతృప్తినిచ్చిందని ఆయన వెల్లడించారు. దర్శకుడు మణికందన్ టేకింగ్, మానవ స్వభావంలోని కోణాలను ఆవిష్కరించిన తీరు ఈ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టిందని సినీ విశ్లేషకులు కూడా ప్రశంసించారు.

3 / 5
థియేటర్లలో భిన్నమైన అనుభూతిని పంచిన ఈ చిత్రం, ఓటీటీ , డిజిటల్ వేదికలపై కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విమర్ధ్ కెరీర్‌లో ఒక మంచి క్లాసిక్‌గా నిలిచిపోయిన ఈ చిత్రం గురించిన ఈ ఆసక్తికర విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ అయిన జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

4 / 5
సహజమైన నటనకు ప్రసిద్ధి చెందిన విమర్ధ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ఒక సాధారణ యువకుడి జీవితంలో ఊహించని పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. మనుషుల ప్రవర్తన, నేరం - శిక్ష చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకుడిని చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తుంది. దర్శకుడు మణికణ్డన్ ఎంచుకున్న పాయింట్ మరియు దానిని తెరకెక్కించిన విధానం సినిమా స్థాయిని పెంచాయి. కమర్షియల్ హంగులకు దూరంగా, పూర్తిగా సహజసిద్ధమైన వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

5 / 5
Follow Us