AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: ఆ హీరోయిన్ మూడు సార్లు నా సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన హీరో సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘సీన్‘. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 06) న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు సూర్య.

Suriya: ఆ హీరోయిన్ మూడు సార్లు నా సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన హీరో సూర్య
Suriya
Basha Shek
|

Updated on: Nov 04, 2026 | 11:35 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొన్నటివరకు వరుస ఫ్లాప్ లు ఎదురైనా ఇప్పుడు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడీ స్టార్ హీరో. ఈ ఏడాది ఇప్పటికే కరుప్పు (తెలుగులో వీరభద్రుడు), విశ్వనాథం అండ్ సన్స్ సినిమాలతో డబుల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు సూర్య. ఇప్పుడు ‘సీన్’ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో రొమాంచం, ఆవేశం సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న జీతూ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళం కుట్టీ నజ్రియా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న సీన్ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 06న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవలే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక సూర్య, నజ్రియా కూడా వరుసగా ఇంటర్యూలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. కాగా సూర్య సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం సూర్య సినిమానే రిజెక్ట్ చేసింది. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడు సార్లు. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు నజ్రియా.

గతంలో నజ్రియా మూడు సార్లు తన సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందని సూర్య తెలిపారు. అయితే ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో అంగీకరించిందని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ‘నా మూడు సినిమాల్లో నటించాల్సిందిగా నేను నజ్రియాను సంప్రదించాను. కానీ వివిధ కారణాలతో ఆమె నా ఆఫర్లను తిరస్కరించింది. గత 12 ఏళ్లలో పలు తమిళ చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె అంగీకరించలేదు. అవకాశాలను కోల్పోయినట్లుగా నజ్రియా భావించలేదు. నచ్చిన కథలను ఎంచుకునే విషయంలో ఆమె చూపించే ఆత్మవిశ్వాసం అభినందనీయం’ అని నజ్రియాపై ప్రశంసలు కురిపించారు సూర్య. ఇక ఇదే విషయంపై నజ్రియా మాట్లాడుతూ.. ’12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాల్లోకి తిరిగి రావడానికి ప్రధాన కారణం.. సూర్య సర్‌. గతంలో ఒకట్రెండుసార్లు వివిధ కారణాలతో ఆయనతో కలిసి నటించే అవకాశాలను నేను తిరస్కరించా. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది’ అని నజ్రియా అన్నారు.

ఇవి కూడా చదవండి

నజియా లేటెస్ట్ ఫొటోస్..

సీన్ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్ మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జయశ్రీ దామోదరన్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. సూర్య, నజ్రియాతో పాటు నస్లేన్, ఆనంద్‌ రాజ్, లాల్, రాజ్‌ ప్రియన్‌ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

సీన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us