AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Midterm Elections: ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ.. అమెరికా సెనెట్, హౌస్‌పై డెమోక్రాట్ల పట్టు!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంగా ఊహించని పరిణామం ఎదురైంది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ సెనెట్, రిపబ్లికన్ల ఆధీనంలోని కీలక స్థానాలను డెమోక్రాట్లు కైవసం చేసుకుంటున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి వచ్చే రెండేళ్లు కాంగ్రెస్‌లో ప్రతిపక్షం నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

US Midterm Elections: ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ.. అమెరికా సెనెట్, హౌస్‌పై డెమోక్రాట్ల పట్టు!
Us Midterm Elections 2026
Anand T
|

Updated on: Nov 04, 2026 | 12:47 PM

Share

తన విధానాలు, నిర్ణయాలతో ప్రపంచాన్ని టెన్షన్‌ పెట్టిస్తున్న ట్రంప్‌ను ఇప్పుడు మిడ్‌ టర్మ్ ఎలక్షన్స్‌ కంగారు పెట్టిస్తున్నాయి. యూఎస్ మిడ్‌ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఊహించని పరిణామం ఎదురైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తమ వ్యతిరేకతను మిడ్ టర్మ్ ఎన్నికల్లో చూపించారు ఓటర్లు. తాజాగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో డెమోక్రాట్లు కీలక స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రిపబ్లికన్ల ఆధీనంలోని కీలక స్థానాలను డెమోక్రాట్లు కైవసం చేసుకుంటున్నారు. రిపబ్లికన్లకు కంచుకోటగా ఉన్న టెక్సాస్‌తో పాటు నార్త్ కరోలినా సీటును డెమోక్రాట్లు దక్కించుకున్నారు.

కీలకమైన సెనేట్‌ను ఇప్పటికే తమ ఖాతాలో వేసుకున్నారు డెమొక్రాట్లు. మొత్తం 100 స్థానాలున్న సెనేట్‌లో మెజారిటీకి అవసరమైన 51 స్థానాలను దాటి ఆధిక్యం సాధించారు. గత ఎన్నికల వరకు 53 స్థానాలతో ఆధిపత్యం చెలాయించిన రిపబ్లికన్లకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి ఆరు స్థానాలను డెమొక్రాట్లు తమ ఖాతాలో వేసుకోవడంతో సెనేట్‌లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో డెమొక్రాట్ల బలం మరింత పెరిగే అవకాశాలున్నాయి.

అలాగే ప్రతినిధుల సభపైనా కన్నేశారు డెమొక్రాట్లు. మొత్తం 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మెజారిటీకి 218 సీట్లు అవసరం. లేటెస్ట్‌ సరళిని పరిశీలిస్తే.. ప్రతినిధుల సభలోనూ డెమొక్రాట్లే విజయం సాధించే అవకాశాలున్నాయి. అదే జరిగితే అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభలూ డెమొక్రాట్ల నియంత్రణలోకి వస్తాయి.పలు రాష్ట్రాల్లో జరిగిన గవర్నర్ ఎన్నికల్లోనూ డెమొక్రాట్లు సత్తా చాటారు. గతంలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న టెక్సాస్, అయోవా, ఒహియో రాష్ట్రాలను డెమొక్రాట్లు కైవసం చేసుకున్నారు. అలాగే సౌత్ కరోలినా, అలబామాల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.

ఈ ఫలితాలతో అమెరికా కాంగ్రెస్‌లో అధికార సమీకరణాలు మారనున్నాయి. కాంగ్రెస్‌లోని రెండు సభలూ డెమొక్రాట్ల నియంత్రణలోకి వస్తే ట్రంప్ ప్రతిపాదించే చట్టాలు, బడ్జెట్ నిర్ణయాలు, కీలక విధానాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. ప్రభుత్వ యంత్రాంగంపై పర్యవేక్షణ, విచారణల విషయంలోనూ డెమొక్రాట్లకు బలం పెరుగుతుంది. దీంతో మిగిలిన రెండేళ్ల ట్రంప్ పాలనలో అమెరికా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.

ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్లకు అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ట్రంప్. డెమొక్రాట్ల దూకుడు, రిపబ్లికన్లకు ఎదురుదెబ్బల నేపథ్యంలో సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. ఎన్నికల్లో తాను పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాడినని, బ్యాలెట్‌పై తన పేరు ఉంటే రిపబ్లికన్లు విజయం సాధించేవారని చెప్పారు. అలాగే ‘వీటో’ అని రాసి ఉన్న క్యాప్‌ ఇమేజ్‌ను కూడా షేర్ చేశారు ట్రంప్. ఈ పోస్టుతో తన వీటో అధికారాన్ని గుర్తు చేస్తున్నారా..? లేక రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్నారా? అన్న చర్చ మొదలైంది. మొత్తంగా ఎన్నికల ఫలితాల వేళ ట్రంప్‌ పోస్టులు అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రేయసి కోసమే ఆ చిలిపి సెలబ్రేషన్..: అర్ష్‌దీప్ సింగ్
ప్రేయసి కోసమే ఆ చిలిపి సెలబ్రేషన్..: అర్ష్‌దీప్ సింగ్
బాలు ప్యాంట్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్..
బాలు ప్యాంట్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్..
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.