RP Patnaik : ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆ హీరోకు నా వాయిస్ అస్సలు సూట్ కాలేదు.. ఆర్పీ పట్నాయక్..
తెలుగు సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి, శ్రోతలను తన మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్‌పీ పట్నాయక్. 2000వ దశకం ప్రారంభంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లవ్ అండ్ రొమాంటిక్ మ్యూజిక్ ట్రెండ్‌ను సృష్టించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రాలతో ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గా ఓవర్ నైట్ స్టార్‌గా మారారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో సంగీత సంచలనం సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్‌పీ పట్నాయక్ . ఒకప్పుడు ఎన్నో చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రయాణం, పాడిన పాటలు, జీవితంలోని అనుభవాలపై ఆయన ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. ఆయన తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా మహేష్ బాబుకు ఒక సినిమా పాట పాడటాన్ని పేర్కొన్నారు. తన స్వరం “కిడ్డిష్”గా (చిన్న పిల్లల గాత్రంలా) ఉందని, అది మహేష్ బాబు వంటి “సూపర్ హీరో”కి అస్సలు సూట్ కాదని ఆయన బలంగా నమ్ముతున్నానని అన్నారు. కానీ అప్పటి పరిస్థితులు తనను పాడేలా ప్రేరేపించినప్పటికీ, తాను ఆ నిర్ణయంపై తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. ఆ సినిమాకు ఒక గాయకుడిగా తాను వంద శాతం పాడకూడదు అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే, చాలా మంచి సంగీతం ఇవ్వగల అవకాశం ఉంటేనే తాను సినిమాకు సంగీతం అందిస్తానని తెలిపారు. కమెడియన్ కన్ను ఎత్తగానే హీరో హీరోయిన్లు పాటలు పాడే సినిమాలు చేయడానికి తాను మానసికంగా సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. పాట సినిమా కథలో ఒక అంతర్భాగం కావాలి. ఒకవేళ పాటను తొలగిస్తే సినిమా కథ ముందుకు సాగకూడదు, అలాంటి పాటలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ, ఆర్.పి. పట్నాయక్ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తనకు తేజ గారి కంటే ముందు నుంచే మంచి స్నేహితుడని తెలిపారు. నువ్వంటే నాకిష్టం సినిమా సిట్టింగ్స్ నుంచి తామిద్దరూ స్నేహితులుగా ఉన్నామని గుర్తుచేసుకున్నారు. సమాజంపై తన బాధ్యతను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రేక్షకులు తనను ఒక స్థానంలో కూర్చోబెట్టారని, వారికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలని తాను భావిస్తున్నానని చెప్పారు. మంచి పాటలు, సినిమాలు అందించడంతో పాటు, బ్రోకర్, ఉమ మహేశ్వరం వంటి సామాజిక ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టుల ద్వారా సమాజంలో మంచి ప్రభావాన్ని సృష్టించాలని తపిస్తున్నానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
