ఎగ్స్ ఎక్కువగా తినేస్తా.. పూజా హెగ్డే ఫాలో అయ్యే డైట్ ప్లాన్ ఇదేనట.. 

Rajitha Chanti

Pic credit - Instagram

04 November 2026

సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో తనదైన గ్లామర్, అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ పూజా హెగ్డే.

ఆమె తన ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తెరపై ఎప్పుడూ ఎంతో అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించే ఈ బుట్టబొమ్మ అందం వెనుక రహస్యం తెలుసా.

తాజాగా పూజా హెగ్డే తన రోజువారీ ఆహారపు అలవాట్లు , డైట్ సీక్రెట్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. తన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలిపారు.

నేను ఉదయం 5 గంటలకు నిద్రలేచి, కాఫీ తాగి, షూటింగ్‌కు వెళ్తాను. మధ్యాహ్నం 12 గంటలకు అల్పాహారం, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భోజనం చేస్తాను.

ఇక అల్పాహారం విషయంలో ఆమె ఎప్పుడూ రాజీపడరు. పోషకాలు నిండిన గుడ్లు, అవకాడో,  తాజా పండ్లను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటానని చెప్పుకొచ్చింది.  

సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చిరుతిండి తిని, ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో భోజనం కంప్లీట్ చేస్తాను. కచ్చితంగా సాయంత్రం తినేస్తానని అన్నారు..

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజంతా విపరీతంగా నీరు తాగుతుంటారు. అలాగే కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు ఆమె డైట్‌లో తప్పకుండా ఉంటాయి.

 సముద్రపు ఆహారాన్ని ఇష్టం. కూరగాయల సలాడ్లంటే అంతగా ఇష్టం లేదు. తాను కఠినమైన ఆహార నియమాలను పాటించనని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.