బాలీవుడ్ నుంచి వచ్చిన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు చాలా త్వరగానే దగ్గరైంది. తన అందం, అభినయంతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో మృణాల్‌కు టాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.
నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' సినిమాలోనూ మృణాల్ తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు తెలుగులో మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, మృణాల్ తెలుగులో వరుస ప్రాజెక్టులు చేయడం లేదు. దీంతో ఆమె తెలుగు సినిమాల వేగం తగ్గించిందనే చర్చ మొదలైంది.
విజయ్ దేవరకొండతో నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత మృణాల్ కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
కేవలం సినిమాల సంఖ్య పెంచుకోవడం కోసం ప్రాజెక్టులు ఒప్పుకోవడం తనకు ఇష్టం లేదని మృణాల్ వెల్లడించింది.
తన పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో పాటు ప్రేక్షకులకు నచ్చే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.