IND vs NZ: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. అయితే భారత అభిమానులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. వర్షం ఆగిపోవడంతో మైదానంలోని కవర్లను తొలగిస్తున్నారు. త్వరలోనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఓవర్లు తగ్గితే టీమిండియా ముందు ఉండే సవరించిన లక్ష్యాలు కూడా వెల్లడయ్యాయి.

భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) తొలి వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో వర్షం మొదట తగ్గినప్పటికీ, మళ్లీ తీవ్రత పెరగడంతో గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని కవర్లతో కప్పేశారు. అయితే స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:24 గంటలకు వర్షం పూర్తిగా ఆగిపోయింది. దీంతో మైదానంలోని కవర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఎక్కువ ఓవర్లు కోల్పోకుండా మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు భారత జట్టు టార్గెట్ 40 ఓవర్లలో 167 పరుగులకు ఫిక్స్ చేశారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి అప్టేట్ వచ్చింది.
ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ఓవర్ తగ్గింపు..
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ఓవర్ల కోత ప్రారంభమైంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:20 గంటల నుంచి ఓవర్లు తగ్గించడం మొదలైంది. సుమారుగా ప్రతి నాలుగు నిమిషాల ఆలస్యానికి ఒక ఓవర్ తగ్గే అవకాశం ఉందని మ్యాచ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వర్షం ఆగిపోవడంతో అభిమానులకు ఊరట లభించింది.
భారత్‌కు డక్‌వర్త్ లూయిస్ లక్ష్యాలు ఇవే..
వర్షం కారణంగా మ్యాచ్ ఓవర్లు తగ్గితే భారత్ ముందు ఉండే సవరించిన లక్ష్యాలు ఇలా ఉన్నాయి:
10 ఓవర్లు తగ్గితే: 40 ఓవర్లలో 167 పరుగులు
20 ఓవర్లు తగ్గితే: 30 ఓవర్లలో 137 పరుగులు
30 ఓవర్లు తగ్గితే: 20 ఓవర్లలో 92 పరుగులు
కోహ్లీ, గిల్ నిలకడగా బ్యాటింగ్..
రోహిత్ శర్మ డకౌట్ కావడంతో భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. అనంతరం విరాట్ కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. న్యూజిలాండ్ బౌలర్లు ఐదు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఒత్తిడి పెంచారు. అయితే కోహ్లీ వరుస బౌండరీలతో ఆ ఒత్తిడిని తగ్గించాడు. ప్రస్తుతం భారత జట్టు లక్ష్య ఛేదనలో మంచి స్థితిలో ఉంది.
🚨 Update 🚨
Play to restart at 9.05 PM Local Time (1.35 PM IST)
Revised target is of 167 runs.
Scorecard ▶️ https://t.co/iZN2Y53Nur
#TeamIndia | #NZvIND
— BCCI (@BCCI) November 4, 2026
భారత్‌కు సవరించిన లక్ష్యాలు ఇవే..!
వర్షం కారణంగా ఓవర్లు తగ్గితే డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం భారత్ ముందు ఉండే లక్ష్యాలు ఇలా ఉన్నాయి:
| ఓవర్ల కోత | భారత లక్ష్యం |
|---|---|
| 1 ఓవర్ | 49 ఓవర్లలో 184 |
| 2 ఓవర్లు | 48 ఓవర్లలో 183 |
| 3 ఓవర్లు | 47 ఓవర్లలో 181 |
| 4 ఓవర్లు | 46 ఓవర్లలో 179 |
| 5 ఓవర్లు | 45 ఓవర్లలో 177 |
20 ఓవర్లకు భారత్ చేరుకోవాల్సిన స్కోర్లు..
వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం పార స్కోర్లు కూడా నిర్ణయించారు.
ఒక వికెట్ కోల్పోతే: 47/1
రెండు వికెట్లు కోల్పోతే: 59/2
మూడు వికెట్లు కోల్పోతే: 73/3
నాలుగు వికెట్లు కోల్పోతే: 91/4
వర్షం పూర్తిగా తగ్గడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుందనే ఆశలు పెరిగాయి. కోహ్లీ, గిల్ క్రీజులో ఉండటంతో భారత అభిమానులు విజయంపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మ్యాచ్ ఎన్ని ఓవర్లకు కుదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
