AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai : అది రెండో ప్రపంచ యుద్ధం నాటి వస్త్రం.. ప్రపంచం మొత్తంలో ఐదే ఉన్నాయి.. బాలు ప్యాంట్ గురించి చెప్పిన రేణు దేశాయ్..

పవన్ కళ్యాణ్ నటించిన బాలు చిత్రంలో ఆయన ధరించిన ప్యాంట్ల ధర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి అరుదైన బట్టతో తయారుచేసిన ఈ ప్యాంట్లు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని, వాటిలో ఒకటి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Renu Desai : అది రెండో ప్రపంచ యుద్ధం నాటి వస్త్రం.. ప్రపంచం మొత్తంలో ఐదే ఉన్నాయి.. బాలు ప్యాంట్ గురించి చెప్పిన రేణు దేశాయ్..
Renu Desai On Balu Pant
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2026 | 1:42 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అందులో బాలు సినిమా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ చిత్రంలోని సాంగ్స్, పవన్ కళ్యాణ్ మేనరిజం, స్టైల్ అప్పట్లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఎంతగా అంటే అప్పటి యూత్ స్వయంగా బాలు స్టైల్ ఫాల అయ్యేంతగా. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంట్.. అప్పట్లో ఆ స్టైల్లో వచ్చిన దుస్తులు చేసిన సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఆయన ధరించిన దుస్తులు, ముఖ్యంగా ప్యాంట్లు, అప్పట్లో అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్, ఈ ప్యాంట్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ , వాటి ధరను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పట్లో రేణు దేశాయ్ పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. బాలు సినిమాలో ఘనీ పాత్ర కోసం కాస్ట్యూమ్స్ కోసం ఎంతో ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ధరించిన ప్యాంట్లు మామూలువి కావు. అవి రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నిజమైన బట్టతో ప్రత్యేకంగా తయారు చేయబడినవి. ఈ బట్ట అరుదైనది కావడంతో, ప్యాంట్లను తయారు చేయించడానికి అడ్వాన్స్ చెల్లించి, మూడు నెలల తర్వాత వాటిని తీసుకోవాల్సి వచ్చిందని రేణు దేశాయ్ వివరించారు. ఇటలికీ చెందిన ప్రముఖ హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ చేతుల మీదుగా ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్యాంట్ ను డిజైన్ చేయించానని అన్నారు.

అప్పట్లో అలాంటి ప్యాంట్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు మాత్రమే తయారు చేయబడ్డాయని, వాటిలో ఒకటి ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్కంకి వెళ్లిందని, ఒకటి పవన్ కళ్యాణ్ కోసం తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ అరుదైన , నాణ్యమైన ప్యాంట్ల ధర ఆ సమయంలో రూ. 75,000 ఉందని అన్నారు. ఆ రోజుల్లో ఇంత పెద్ద మొత్తం పెట్టి ఒక దుస్తుల వస్తువు కొనడం సాధారణ విషయం కాదని, ఇది సినిమాపై , పాత్రపై మేకర్స్ చూపిన అంకితభావాన్ని తెలియజేస్తుందని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ సినిమాకు అంత భారీ మొత్తాన్ని భరించడానికి చిత్ర నిర్మాత అశ్వినీదత్ సిద్దంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ నిరాకరించి తన సొంత ఖర్చులతోనే దానిని రూపొందించుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

రేణు దేశాయ్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
బాలు ప్యాంట్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్..
బాలు ప్యాంట్ సీక్రెట్ రివీల్ చేసిన రేణు దేశాయ్..
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.
నంబర్ 3 @ 13 వేలు.. ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ..
నంబర్ 3 @ 13 వేలు.. ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ..