AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీళ్ల నొప్పులు, ఉబ్బసానికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఇది తింటే నరాల్లో, ఎముకల్లో ఇనుమంత బలం!

మినుములు పోషకాలకు మంచి నిలయం. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. మినుములను సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు, కండరాలు, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మినుములతో కలిగే ప్రయోజనాలు, తీసుకునే విధానం గురించి తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు, ఉబ్బసానికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఇది తింటే నరాల్లో, ఎముకల్లో ఇనుమంత బలం!
Black Gram Benefits
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2026 | 1:41 PM

Share

మనం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అనేక రకాల తృణధాన్యాలు, పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. అలాంటి వాటిలో మినుములు అత్యంత ముఖ్యమైనవి. మినుములను తరచుగా తీసుకోవడం వల్ల ఇనుమంత బలం వస్తుందనే నానుడి ప్రచారంలో ఉంది. ఈ నానుడికి తగ్గట్టుగానే, మినుముల్లోని అపారమైన పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయని, తద్వారా అనేక రకాల వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మినుముల్లో ఎన్నో పోషకాలు..

మినుములలో (Black Gram / Minapa Pappu) శరీరానికి కావలసిన అనేక ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, బి-కాంప్లెక్స్, విటమిన్-సి, మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.. ఇవి నాడీ వ్యవస్థను, జీవక్రియను సక్రమంగా ఉంచుతాయి.

మినుముల ప్రయోజనాలు..

మినుములను నిత్యం ఆహార పదార్థాల్లో భాగంగా చేసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. మినుముల్లో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం, ఉబ్బసం వంటి సమస్యల నివారణకు కూడా మినుములు సహాయపడతాయి.

మధుమేహం, రక్తహీనత వంటి సమస్యలకు మినుములు అద్భుతమైన పరిష్కారం. వీటిలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి, ఇన్సులిన్, గ్లూకోస్ స్థాయులను నియంత్రించడం ద్వారా మధుమేహ సమస్య తలెత్తకుండా రక్షిస్తాయి. అంతేకాకుండా, ఇవి రక్తహీనతను కూడా సమర్థవంతంగా నివారిస్తాయి.

మినుముల్లో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకలను బలంగా, దృఢంగా ఉంచడానికి అత్యవసరం. కాబట్టి, ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో మినుములను చేర్చుకోవడం వల్ల గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు.

అందుకే.. ఆహారంలో మినుములను భాగం చేసుకోవాలని.. తరచూ వీటితో చేసిన పదార్థాలను తినాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. మినుములతో చేసిన ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్ తోపాటు లంచ్ లో కూడా మంచిగా తీసుకోవచ్చు..

అయితే.. ఏమైనా సందేహాలున్నా.. అనారోగ్య సమస్యలున్నా.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
ఇనుమంత బలం కావాలా? రోజువారీ ఆహారంలో ఈ పప్పును చేర్చుకోండి!
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
బెంగాల్‌లో దీపావళి రోజున లక్ష్మీదేవికి బదులుగా కాళీదేవిని..
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
కేసీఆర్ వల్లే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది: జబర్దస్త్ నటుడు
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఆ సినిమాలో నేను పాడకుండా ఉండాల్సింది.. ఆర్పీ పట్నాయక్..
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌.. తుఫాన్‌ల ప్రభావంపై ఆరా
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆగిన వర్షం.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
పెద్ద హీరోలతో 30 సినిమాలు కట్ చేస్తే.. ఇప్పుడు జిల్లా కలెక్టర్..
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.
చిన్నప్పుడు బడికి వెళ్తున్నారు.. టీనేజ్‌లోనే చదువు ఆపేస్తున్నారు.
నంబర్ 3 @ 13 వేలు.. ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ..
నంబర్ 3 @ 13 వేలు.. ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ..
బయటకు కనిపించేది కొబ్బరి బొండాల లోడ్‌.. లోపల చూస్తే..
బయటకు కనిపించేది కొబ్బరి బొండాల లోడ్‌.. లోపల చూస్తే..