AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: తెలుగులో ఆ స్టార్ హీరో అంటే ఇష్టం.. అతడితో కలిసి నటించాలని ఉంది.. రుక్మిణి వసంత్..

ప్రస్తుతం పాన్ ఇండియా సినీప్రియుల హృదయాలు దొచేసిన హీరోయిన్ రుక్మిణీ వసంత్. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో అందం, నటనతో మంచి ప్రసంశలు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మడు చెప్పిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.

Rukmini Vasanth: తెలుగులో ఆ స్టార్ హీరో అంటే ఇష్టం.. అతడితో కలిసి నటించాలని ఉంది.. రుక్మిణి వసంత్..
Rukmini Vasanth
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2025 | 6:16 PM

Share

ప్రస్తుతం నేషనల్ క్ర‏ష్‏గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. రక్షిత్ శెట్టి సరసన సప్త సాగరాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో ఈ బెంగుళూరు బ్యూటీ పేరు మారుమోగింది.ఈ సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ జోడిగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు ఈ బ్యూటీకి పాన్ ఇండియ లెవల్లో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె పేరు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్.. తెలుగులో తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పేసింది. తెలుగులో మీకు ఏ హీరో అంటే ఇష్టం ? ఎవరితో నటించాలని ఉందని అడగ్గా.. తనకు న్యాచురల్ స్టార్ నాని అంటే ఫేవరేట్ అని తెలిపింది. ఆయనతో కలిసి సినిమా చేయాలనుకున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవల వరుసగా కాంతార సినిమాలో తన లుక్స్ షేర్ చేస్తూ జనాలను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.