Kamal Haasan: కమల్ స్టామినాపై కుదిరిన నమ్మకం.. విక్రమ్‌ హిట్‌తో లోకనాయకుడి దశ తిరిగిందిగా..

Vikram Movie: విక్రమ్ సినిమాతో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) మరోసారి ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఇన్నాళ్లు కమల్‌ సినిమా అంటే భయపడిపోయిన మేకర్స్‌.. ఇప్పుడు పాత ప్రాజెక్ట్స్‌ను కొత్తగా చూపించేందుకు రెడీ అవుతున్నారు.

Kamal Haasan: కమల్ స్టామినాపై కుదిరిన నమ్మకం.. విక్రమ్‌ హిట్‌తో లోకనాయకుడి దశ తిరిగిందిగా..
Kamal Haasan
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 25, 2022 | 11:41 AM

Kamal Haasan Upcoming Movies: విక్రమ్ సినిమాతో కమల్‌ హాసన్‌ మరోసారి ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఇన్నాళ్లు కమల్‌ సినిమా అంటే భయపడిపోయిన మేకర్స్‌.. ఇప్పుడు పాత ప్రాజెక్ట్స్‌ను కొత్తగా చూపించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఏవేవో కారణాలతో మధ్యలో ఆగిపోయిన చాలా సినిమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా లైన్‌లోకి వస్తున్నాయి. విక్రమ్ (Vikram Movie) కమల్ హాసన్ కెరీర్‌లో చాలా కాలం తరువాత వచ్చిన బిగ్ హిట్‌. ఈ సక్సెస్‌ లోకనాయకుడిని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయటమే కాదు.. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆయన ప్రాజెక్ట్స్ విషయంలోనూ కదలిక తీసుకువచ్చింది. కమల్ మార్కెట్‌ స్టామినా మీద అనుమానాలతో పాటు ఇతరత్ర కారణాలతో ఆగిపోయిన నాలుగు సినిమాలు ఇప్పుడు పట్టాలెక్కాయి.

విక్రమ్ సూపర్ హిట్ అన్న టాక్ వినిపించగానే.. గత రెండేళ్లుగా వాయిదాపడుతూ వచ్చిన ఇండియన్ 2 వర్క్ రీస్టార్ట్ అయ్యింది. మరోసారి వందలకోట్ల వసూళ్లతో లోకనాయకుడు సత్తా చాటడంతో బిగ్‌ బడ్జెట్‌తో ఇండియన్‌ 2ను రూపొందించేందుకు ముందుకు వచ్చారు మేకర్స్‌. శంకర్ దర్శకత్వంవహిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ ముహుర్తం పూజా కార్యక్రమం బుధవారం (24 ఆగస్టు) నిర్వహించారు.  అదే సమయంలో కమల్‌ డైరెక్షన్‌లోనే స్టార్ట్ చేసిన శభాష్ నాయుడు సినిమాను కూడా రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ రాఘవన్‌. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. ప్రజెంట్ కమల్ మంచి ఫామ్‌లో ఉండటంతో రాఘవన్‌ సీక్వెల్‌కు ఇదే పర్ఫెక్ట్‌ టైమ్‌ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్‌. వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. మొత్తానికి విక్రమ్ హిట్‌తో కమల్ స్టామినా మీద మేకర్స్‌కు నమ్మకం కుదిరినట్లుంది. దీంతో ఆయనతో మూవీస్ కోసం పోటీపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..