AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Review: ‘లైగర్’ రివ్యూ.. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో..

Liger Movie Review: ఈ క్రమంలోనే తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు కానీ ఆమె అతని మోసం చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైగర్ నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యాడు.. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కి ఎలా వెళ్లాడు అనేది మిగిలిన కథ.

Liger Review: 'లైగర్' రివ్యూ.. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో..
Liger Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Aug 25, 2022 | 12:10 PM

Share

మూవీ రివ్యూ: లైగర్

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనిత్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు

సంగీతం: విక్రమ్ మోంత్రోసే, సునీల్ కశ్యప్, తనిష్క్ బఘ్చీ, లియో జార్జ్-డిజే చీట్స్, జానీ

ఎడిటర్: జునైద్ సిద్ధికీ

సినిమాటోగ్రాఫర్: విష్ణు శర్మ

దర్శకుడు: పూరీ జగన్నాథ్

నిర్మాతలు: కరణ్ జోహార్, పూరీ జగన్నాత్, ఛార్మి కౌర్, అపూర్వ మెహతా, హిరో యశ్ జోహార్

రిలీజ్ డేట్: 2022-08-25

లైగర్.. దేశమంతా ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.. మాట్లాడుకునేలా చేసారు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి లైగర్ అంచనాలు అందుకున్నాడా.. బాక్సాఫీస్ దగ్గర వాట్ లగా దేంగే అన్నాడా లేదా రివ్యూలో చూద్దాం..

కథ:

లైగర్ (విజయ్ దేవరకొండ), వాళ్ళ అమ్మ బాలమణి (రమ్యకృష్ణ) కరీంనగర్ నుంచి ముంబైకి వస్తారు. ఓ చాయ్ బండి నడుపుకుంటూ తన కొడుకుని నేషనల్ ఛాంపియన్ చేయాలని కలలు కంటుంది. దానికోసం ఒక కోచ్ ను పట్టుకొని ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకుంటాడు లైగర్. ఈ క్రమంలోనే తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు కానీ ఆమె అతని మోసం చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైగర్ నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యాడు.. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కి ఎలా వెళ్లాడు అనేది మిగిలిన కథ.

కథనం:

పూరీ సినిమాలు ఇలా ఉంటాయి అని ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలా ఉంటుందని ఊహించుకుని వెళ్తారో.. అదే సినిమా చూపిస్తారు పూరీ. ఇప్పుడు లైగర్ కూడా అదే. కాకపోతే ఇది పాన్ ఇండియా స్టైల్‌లో కాస్త గ్రాండ్‌గా చూపించారంతే. కాకపోతే టేకింగ్, మేకింగ్ అంతా సేమ్ టూ సేమ్ అదే పూరీ జగన్నాథే. విజయ్ లాంటి నటుడు దొరికేసరికి లైగర్ స్వరూపమే మారిపోయింది. చిన్న బడ్జెట్ తో చేయాలనుకున్న సినిమాను.. పాన్ ఇండియా యాక్షన్ సినిమాగా మార్చేశారు పూరీ. మొదటి సీన్ నుంచే కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు పూరి జగన్నాథ్. తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మాత్రమే స్క్రీన్ మీద చూపించాడు. అయితే మధ్యలో హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి స్ఫూర్తి కనిపిస్తున్న అది ఇది వేరుగా ఉంటుంది. ముఖ్యంగా అందులో ఉన్న ఎమోషన్ సీన్స్ ఇందులో మిస్ అయినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఫస్టాఫ్ అంత యాక్షన్ సన్నివేశాలతో పాటు.. అక్కడక్కడ మదర్ సెంటిమెంట్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇంటర్వెల్ కు చిన్న ట్విస్ట్ ఇచ్చి.. ఆ తర్వాత నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కు లైగర్ ఎలా వెళ్లాడు అనే జర్నీ చూపించాడు. అందరూ ముందు నుంచి ఊహించింది క్లైమాక్స్.. ఎందుకంటే అప్పుడే మైక్ టైసన్ వచ్చేది.. దాన్ని ఊహించినంత చిత్రీకరించలేకపోయాడు పూరి జగన్నాథ్. టైసన్ లాంటి ఫైటర్ను తీసుకొచ్చి చాలా సిల్లీగా క్లైమాక్స్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా రొటీన్ కథకు ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తోడు కావడంతో లైగర్ అంత ఆసక్తికరంగా మారలేదు. కాకపోతే విజయ్ దేవరకొండ మాత్రం అద్భుతంగా నటించాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు వన్ మ్యాన్ షోలా కనిపించాడు.

నటీనటులు:

విజయ్ దేవరకొండ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సరిపోయే కారెక్టర్ దొరికితే ఎలా రప్ఫాడుకుంటాడో అర్జున్ రెడ్డిలోనే చూపించేసారు. ఇప్పుడు లైగర్‌లోనూ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు విజయ్. పూర్తిగా ఆయన కారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్. పూరీ ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా అద్భుతమే. నత్తితో కూడా అదరగొట్టారు విజయ్. మార్షల్ ఆర్ట్స్‌లోనూ సత్తా చూపించారు. అనన్యా పాండే కారెక్టర్ ఉన్నంత వరకు ఓకే. రమ్యకృష్ణ చాలా బాగా నటించారు. ఆమెకు మరో పవర్ ఫుల్ కారెక్టర్ దొరికింది. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే బాగున్నారు. మైక్ టైసన్ పాత్రను పూరీ అదిరిపోయే డిజైన్ చేసారు. ఆయన పాత్ర సినిమాకు మెయిన్ హైలైట్. స్క్రీన్ పై చాలా సరదాగా కనిపించారు మైక్.

టెక్నికల్ టీం:

లైగర్ సినిమాకు సంగీతం అందించింది ఒక్కరు కాదు.. ఈ సినిమాకు చాలా మంది సంగీత దర్శకులు పని చేసారు. విక్రమ్ మోంత్రోసే, సునీల్ కశ్యప్, తనిష్క్ బఘ్చీ, లియో జార్జ్-డిజే చీట్స్, జానీ అందించిన పాటలు బాగున్నాయి. విజువల్‌గానూ చాలా బాగా చిత్రీకరించారు పూరీ జగన్నాథ్. సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఎడిటింగ్ పర్లేదు. ఈ విషయంలో జునైద్ వర్క్ బాగానే ఉంది. చివరగా పూరీ జగన్నాథ్ గురించి చెప్పాలి. తనకు కావాల్సినంత టైమ్ తీసుకుని.. విజువల్స్ అదరగొట్టారు. యాక్షన్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. కానీ కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది. చాలా సింపుల్ కథను దేశం మొత్తానికి చూపించాలనుకున్నాడు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు.

పంచ్ లైన్: 

లైగర్.. ప్చ్.. పంచ్ మిస్సైంది..